సాంఖ్య యోగము
భగవద్గీత
అన్నది కానీ వెంటనే మోక్షాన్ని అందిస్తుందని చెప్పలేదు గదా. అది ఆత్మజ్ఞానానంతరమనే అభిప్రాయంతో చెప్పి ఉండవచ్చు. తప్పేమిటంటారు భగవత్పాదులు. ఇది ఎలాంటిదంటే న్యూయార్కు పట్టణానికొకడు విమానంలో వెళ్లిపోయాడని ఎవరైనా అన్నారనుకోండి. న్యూయార్కు దాకా ఒకే విమానమని కాదు గదా. సింగపూరుదాకా ఒక విమానమైతే ఆ తరువాత న్యూయార్కు దాకా మరొక విమానమని గదా మనమర్ధం చేసుకోవలసింది. అందులో మొదటి విమానం రెండవ విమానాని కందిస్తే అది మరి దేనికీ అందివ్వకుండా గమ్యాన్నే చేరుస్తుంది మనలను. అలాగే ఇక్కడ కర్మమోక్షాన్ని ఇస్తుందంటే జ్ఞానం ద్వారానని చెప్పుకోవాలర్ధం. ఇదీ భాష్యకారులిక్కడ చేసిన అద్భుతమైన పరిష్కారం సమన్వయం Synthesis 18 అధ్యాయాల గీతాశ్రవణమయ్యే వరకూ ఈ సమన్వయ దృష్టి ఏమరకుండా శ్రవణం చేయవలసి ఉంటుంది మనం.
నేహాభిక్రమనాశోఽస్తి ప్రత్యవాయో న విద్యతే |
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ || 40 ||
ప్రస్తుత మీ ఆత్మజ్ఞానానికి దోహదం చేసే కర్మయోగమెలాంటిదో దానికున్న విశిష్టత ఏమిటో బయట పెడుతున్నాడు పరమాత్మ. నేహాభిక్రమనాశోస్తి. అభిక్రమమంటే ఉపక్రమం ప్రారంభమని అర్ధం. కర్మయోగాన్ని జీవితంలో ప్రారంభంచేస్తూ పోతే దానికెప్పుడూ వినాశం లేదు. ఫలిత ముంటుందో లేదోనని సందేహించ నక్కరలేదు. తప్పకుండా
Page 132