సాంఖ్య యోగము
భగవద్గీత
కర్మ అంటే అది జ్ఞానంలాగా ఒకటిగాదు. కర్మానుష్ఠానం కర్మయోగం - సమాధి యోగమని మూడు విధాలది. పెద్దలంతా చేశారు మనమూ ఆ మార్గంలోనే నడవటం మంచిదని మామూలుగా చేస్తూపోతే అది అనుష్ఠానం Ritual. అలాకాక ఆ చేసే ప్రతి కర్మా నేనే చేస్తున్నాననే కర్తృత్వబుద్ధీ - నాకోసమేననే భోక్తృత్వ బుద్దీ వదిలేసి ఒకానొక ఈశ్వరుడు చేయిస్తున్నాడు - ఆయనకోసమే ఇది - అని నిర్లిప్తంగా చేయగలిగితే అది యోగం Religion అది కూడా దాటిపోయి చిత్తవృత్తులన్నీ కట్టివేసి ఏకాగ్రతతో ధ్యానిస్తూ పోతే అది సమాధి Meditation. దీనివల్ల కలిగే మేలేమంటే చిత్తానికి శుద్ది ఏకాగ్రత Purification and Concentration రెండూ ఏర్పడతాయి. దాని వల్ల ధర్మాధర్మాలనే ద్వంద్వాలు నిన్ను బంధించవు. ఆ బంధంలో నుంచి బయటపడతావు. అయితే అది మోక్షమా అంటే కాదు. అసలైన మోక్షం జ్ఞానంవల్లనే. ఆ జ్ఞానానికి దారి తీస్తుందీ కర్మ. కర్మయోగంగా మారి యోగం సమాధిగా మారి దానివల్ల ఈశ్వరుడు ప్రసన్నుడయి తన్నిమిత్తంగా నీకు జ్ఞానమనేది ఉదయిస్తే ఆజ్ఞానం వల్ల నీకు ముక్తి.
అంటే అప్పటికి ఉత్తమాధికారికి జ్ఞానమే సాక్షాత్తుగా మోక్షప్రదం. మధ్యమ మందాధికారులకు కర్మజ్ఞానానికి దోహదం చేసి తద్వారా మోక్షదాయకం. సాక్షాత్తుగా కాదు. పరంపరయా Not direct but indirect. అయితే కర్మబంధం ప్రహాస్యసి అని ఎందుకన్నది భగవద్గీత.
Page 131