#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

మంచిదే. దీనివల్ల నీవీ కర్మబంధాన్ని వదిలించుకొని బయటపడగలవు. భయం లేదని హామీ ఇస్తాడు.

  ఏమిటీ గొడవ. నిజంగా గొడవగానే ఉందీ మాట. జ్ఞానంతోనా మానవుడు బంధ విముక్తు డయ్యేది. కర్మతోనా. జ్ఞానాదేవతు కైవల్యమని గదా శాస్త్రం చెబుతున్నది. అలాంటప్పుడు కర్మతోనే తరించవచ్చు. నంటుందేమిటి గీత. కర్మ ఇంకా బంధంలో పడదోస్తుందే గాని పైకి తీసుకుపోదు గదా. కర్మే మనకు తారకమైతే ఇక ఇంత కష్టపడి మనం జ్ఞానం సంపాదించటం దేనికి. అలా సంపాదించమని మొదటినుంచీ మనకు సలహా ఇవ్వటం దేనికి పరమాత్మ.

  భగవత్పాదు లీ సమస్యను ఎలా పరిష్కరిస్తారో విందాం. సాంఖ్యే పరమార్ధ వస్తు విషయే బుద్ధిః జ్ఞానం - సాక్షాత్ శోకమోహాది సంసారహేతు దోషనివృత్తి కారణం. యోగేతు తత్రాప్త్యుపాయే నిస్సంగతయా ద్వంద్వప్రహాణ పూర్వకం ఈశ్వరా రాధనార్థే కర్మయోగే కర్మానుష్ఠానే సమాధియోగేచ - తాం బుద్ధిం సౌతి ప్రరోచనార్థం. తయాయుక్తః కర్మబంధం ధర్మాధర్మాఖ్యం ప్రహాస్యసి - ఈశ్వర ప్రసాద నిమిత్తజ్ఞాన ప్రాప్త్యివ ఇత్యభిప్రాయః ఇదీ ఆయన ఇక్కడ చేసిన పరిష్కారం. ఇది చాలా గొప్ప పరిష్కారం. కర్మజ్ఞానాలు రెండూ గర్భశత్రువులని భావిస్తారేమో అలా చూడకండి. సవిమర్శంగా చూస్తే రెండింటికీ ఎంతో గొప్ప సమన్వయ ముంది. చెబుతాను వినమంటున్నా రాయన.

Page 130

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు