#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

  ఇంతెందుకు. ఒకడికి అనుకూలమైనది వేరొకడికి ప్రతీకూలం. వాడికి ప్రతికూలమైనది వీడికి అనుకూలం. మనం చూచే చూపును బట్టి మంచి చెడ్డలు మారుతుంటాయి. శీతోష్ణాదులూ సుఖదుఃఖాదులూ అన్నీ ఇంతే. ఎప్పుడైతే మన బుద్ధిని బట్టి వాటికి విలువ వస్తున్నదో - స్వయంగా వాటికే భావమూ లేదో మనం చేయవలసిన పనేమిటి. ఆచూపుతో వాటిని చూడక పోవటమే. శాస్త్రీయంగా మాటాడితే ఇది హేయమిది ఉపాదేయమని తేడా చూడగూడదు. సమేకృత్వా రెండూ సమానమేనని భావించాలి. ఎప్పుడేది ప్రాప్తిస్తే అదే నాకు ప్రాప్తమని దానితో రాజీ పడాలి.

  అలా పడగలమా అంటే మానవుడి కసాధ్యమేదీ లేదు. అచేతనమైన సుఖదుఃఖాది భావాలకే అంత బలమున్నప్పుడు సచేతనుడయి ఆలోచనాపరుడైన మానవుడి బుద్ధికెంత బలముండాలి. దృఢమైన బుద్ధి బలమున్న వాడికిది హేయ Avoidable మిది ఉపాదేయ Acceptable మనే చింత ఉండదు. మరేముంటుం దంటారు. రెండూ ఏకమే ఏదైతేనేమి అని ఉదాసీన బుద్ధి లేదా ఉపేక్షా బుద్ధి Detached Attitude మాత్రమే ఉంటుంది. అదే నీకు యమ ధైర్యమిస్తుంది. ఆ ధైర్యంతో నీవు ముందుకు సాగిపోతే ప్రతికూలం కూడా అంత బలంగా వచ్చి నిన్ను బాధించదు. కొంత కాలానికదే అనుకూలంగా మారిపోయినా ఆశ్చర్యం లేదు.

  అలా కాకుంటే భగవాను డింతగా మనకు హామీ ఇవ్వడీ విషయంలో. తతో యుద్ధాయ యుజ్యస్వ. అంచేత వెనక్కు తగ్గకుండా జీవిత సమరంలో

Page 126

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు