#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

  ఇంతకూ ఒక్క మాట చెబుతాను విను. లోకమంతా ద్వంద్వాత్మకం. ద్వంద్వాలంటే ఏవోగావు. సుఖదుఃఖే లాభా లాభౌ జయా జయౌ. సుఖమూ - దుఃఖమూ లాభమూ నష్టమూ - జయమూ - అపజయమూ ఇలాంటివి. ఉదాహరణ కొక మూడిచ్చిందేగాని ఇలాటి ద్వంద్వాలు Opposites ఎన్నో ఉన్నాయి సృష్టిలో. అవన్నీ మన జీవితంలో తొంగి చూస్తుంటాయి. సలహా ఇస్తుంటాయి కూడా. సుఖాన్నే దగ్గర పెట్టుకో దుఃఖం పనికిరాదు. దాన్ని త్రోసివేయి. లాభం కోసమే ప్రయత్నించు. ఎప్పుడూ నష్టాన్ని కొని తెచ్చుకోకు. జీవితంలో ఏ పని చేసినా అందులో నీకు జయమే చేకూరాలి గాని అపజయం కలగ కూడదు. ఇలా అనుకూలం వైపే నీ మనసు తిప్పుతుంటుంది. ప్రతికూలం కోరి తెచ్చుకో డెవ్వడడూ.

  కాని ఎప్పుడూ నీవు కోరిందే నీకు లభిస్తుందని హామీ ఇవ్వలే రెవ్వరూ. పుణ్యానికి పోతే పాప మెదురయినట్టు జీవితంలో సుఖంగా బ్రతకాలని కోరుకొంటే తరుచు దుఃఖమే మనకు ప్రాప్తించవచ్చు. వచ్చుగాదు. అదే మనకు తరుచుగా ఏర్పడే పరిస్థితి. దీనికేమిటి పరిహారమని మామూలుగా ఎవ్వడూ ఆలోచించడు లోకంలో. కొంచెం విమర్శించి చూస్తే కష్ట సుఖాలనేవి వాటిలో లేవు. ఇది కష్టమిది సుఖమని వాటిమీద ఎవడూ ముద్ర వేయలేదు. వాటి పాటికవి వేసుకోనూ లేదు. దృశ్యమైన పదార్ధంలో లేదు వైషమ్యం. ద్రష్ట అయిన మనలోనే ఉంది. దృశ్యంలో లేదు మానవుడి దృష్టిలో ఉందని అర్ధం.

Page 125

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు