#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

కాని వారూ ఇక ఎవరూ మాటాడటానికి లేదు. మనమేమీ కాని పనిచేయటం లేదనే ధైర్యముంటుంది మనకు. కాబట్టి ఒకరి మెప్పు లేకపోయినా తప్పు పట్టటానికి లేదెవ్వరూ. వారు కితాబిచ్చినా ఇవ్వకపోయినా మన ధర్మం మనం నెరవేర్చామనే ఆత్మ సంతృప్తి అయినా ఉంటుంది మనకు.

హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్ |
తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః || 37 ||

  మన ధర్మం మనం చేస్తూపోతే అది మన కనుకూలంగానే పరిణమిస్తుందని ఏమిటి నమ్మకం. యుద్ధం చేయమన్నారు. బాగానే ఉంది. యుద్ధంలో మనకు విజయమే దక్కుతుందని చెప్పలేము గదా. అడుసులో పాతిన స్తంభమది. ఎటు ప్రక్క ఒరుగుతుందో చెప్పటం కష్టం. జయాపజయాలు దైవాధీనాలు. మనకే అపజయం కలిగినా కలగవచ్చు గదా అని కీడు శంకించావో. అప్పటికీ నీకెలాటి మోసమూ లేదని హామీ ఇస్తున్నాడు కృష్ణభగవానుడు.

  అర్జునా. నీవు శంకించినట్టు ఒకవేళ నీకు పరాజయమే ప్రాప్తించి యుద్ధభూమిలోనే హతోవా మరణించావనుకో అయినా భయం లేదు. ప్రాప్స్యసే స్వర్గం. వీరస్వర్గమైనా లభిస్తుంది నీకు. ఇహంలో అనుభవించిన దానికంటే వెయ్యిరెట్లు సుఖమను భవిస్తావు స్వర్గంలో. అలా కాక నీకు యుద్ధంలో విజయమే ప్రాప్తించిందనుకో. జిత్వావా భోక్ష్యసే మహీం.

Page 123

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు