#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

  మరి ఇంత గుణదోషాలు చూపి చెప్పినా నీ వర్ధం చేసుకోలేకపోతే అది నీ దౌర్భాగ్యం. అవాచ్యవాదాంశ్చ బహూన్ పదిష్యంతి. నలుగురి నోళ్లలో నానిపోతావు. అనరాని మాటలంటారు నిన్ను. ఒకటి గాదు రెండు గాదు. ఎన్ని తిట్లు తిడతారో. నోటబట్టరాని తిట్లు తిడతారు. అవన్నీ నీవు భరించవలసి ఉంటుంది. ఎవరా తిట్టేవారు. అహితాః నీవంటే పడని దుర్యోధనాదులు. హితులైన భీష్మద్రోణాదూలందరూ అయ్యో అర్జునుడేమా ఇలా డీలాపడి పారిపోయాడని బాధపడుతుంటే - అహితులైన కర్ణ దుర్యోధనాదులకదే మంచి అవకాశం నానా మాటలూ అనటానికీ ఆడిపోసుకోటానికీ. నిందం తస్తవ సామర్ధ్యం - స్వర్గం దాకా వెళ్లి నివాత కవచాది రాక్షసుల నెంతోమందిని మట్టుపెట్టి దేవేంద్రుడి చేత కూడా బహుమానం పొందిన వాడేమిటిలా పిరికి పందలాగా పారిపోయాడు. ఇంతేనా ఈ అర్జునుడి సామర్థ్యమని హేళన చేస్తారు కూడా. ఇంతకన్నా తతో దుఃఖతరం ను కిమ్ విచారకరమైన విషయమే ముంటుంది. ఇటు నీకు కావలసిన వాళ్లూ నిన్ను మెచ్చరు. అటు పరాయి వాళ్లూ నిన్ను పరిహసిస్తారు - నీబోటి మహావీరుడికిది ఎలాటి సిగ్గుచేటయిన వ్యవహారం. ఒక్కక్షణం స్తిమితంగా ఆలోచించి చూడు నీకే తెలుస్తుంది.

  ఎవరికి. అర్జునుడికా మనకూ కూడా. తొందరపడి ఒక నిర్ణయం తీసుకొన్నామంటే అది ఎంత పశ్చాత్తాపానికైనా దారి తీస్తుంది. లోకులందరిలో తలవంపు తెచ్చుకొంటాము. నవ్వుల పాలవుతాము. అదే ముందు వెనుక లాలోచించి ఏది కర్తవ్యమో అది చేశామంటే అయినవారూ

Page 122

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు