సాంఖ్య యోగము
భగవద్గీత
ఇంతమంది సైనికులను చూచి భయపడి పిరికి పందలాగా పరుగెత్తి పోయాడని చీకొడతారు. ఎవరు ఎవరో దుర్యోధనాదులే గాదు నీకు ఆప్తులని భావించే మహారధాః భీష్మ ద్రోణాది అతిరధ మహారధులు కూడా.
మొదటినుంచీ నీకు భీష్మద్రోణులంటే గౌరవమే గదా. అంతేకాక యేషాంచత్వం బహుమతో భూత్వా. వారికి నీవన్నా ఎంతో అభిమానమే గదా. శత్రుపక్షంలో ఉండి కూడా వారు నిన్నభిమాని స్తున్నారంటే చూడు. నీవు వారి దృష్టిలో ఎంత ప్రేమ పాత్రుడవో. అలాంటి అవ్యాజమైన ఆదరాభిమానాలను పెద్దల వద్ద సంపాదించి అది నిలబెట్టుకోలేక తప్పించుకొని పోయావంటే ఏమి మర్యాద. మర్యాద లేకపోగా నవ్వులపాలయి పోతావు. యాస్యసి లాఘవమ్. చాలా తేలిక మనిషివని పించుకోవలసి వస్తుంది. కనుక ధైర్యంగా యుద్ధానికే ఉపక్రమించు.
ఇది అర్జునుడికే కాదు. మనలాటి అర్జునులకు కూడానని చెప్పాను. ప్రతి వాక్యమూ ఎక్కడికక్కడ మన జీవితాలకూ కూడా అన్వయించుకొంటూ పోవాలి. ఒకటి ధర్మమని తోచినప్పుడలాగే నడుచుకోవాలి గాని మానవుడెగ గొట్టి తిరగకూడదు. తిరిగితే నలుగురూ చీకొట్టటమే గాదు. మనకూ అది మంచి చేయదు. ఎప్పటికైనా అది ముప్పు తెస్తుంది జీవితంలో. ఇది మనలో ప్రతి ఒక్కరికీ నిత్య జీవితంలో ప్రత్యక్ష సిద్ధమే.
అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః |
నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్ || 36 ||
Page 121