సాంఖ్య యోగము
భగవద్గీత
నేనుంటే గదా చూడటాని కంటావా. నీవున్నా లేకపోయినా ఆకళంకం తప్పదు నీకు. నీ అనంతరం కూడా నీకు చెడ్డ పేరే. అది చెప్పుకొంటూనే ఉంటారు లోకులంతా. అవ్యయాం. అది ఎప్పటికీ మాసిపోదు. నీవు కన్ను మూసినా నీవారసులూ నీ కొడుకులూ మనవళ్లైనా వినవలసి వస్తుంది కర్ణకఠోరమైన ఆ మాటలు. అది నీకేమి మర్యాద. సంభావితస్య చా కీర్తిః - అంతో ఇంతో పేరుగా బ్రతికినవాడవు గదా నీవు జీవితంలో. బ్రతికి నంతకాలమూ అంత గౌరవ ప్రతిష్ఠలతో బ్రతికి చివరకందరి చేతా పనికిమాలిన వాడనిపించుకొని పోవటం కన్నా అపఖ్యాతి ఉందా నీకు. మరణం కన్నా అది బాధాకరం. ఎవడైనా ఒక్కసారే మరణిస్తాడు. పదే పదే మరణించడు. కాని పాడు పేరు తెచ్చుకొని జీవించినా ప్రతిక్షణమూ మరణమే. అలా బ్రతకటం కన్నా వెంటనే ఆత్మహత్య చేసుకొని పోవటం మంచిది. మానహాని కంటే మరణం మేలన్నారు పెద్దలు. కనుక అలా నికృష్టమైన చావు చావకుండా యుద్ధం చేసి మహా వీరుడ వనిపించుకొని మరణించు. అది నీకు యశస్సునూ తెస్తుంది. అపవాదమూ తప్పిస్తుంది.
భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః |
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్ || 35 ||
అలాకాక యుద్ధభూమి నుంచి పలాయనం చిత్తగించా వనుకో. అది గొప్పగా భావించరెవరూ. ఎంత మహత్తర కార్యం చేశాడీ అర్జునుడని నీకు కిరీటమూ పెట్టరు. భయాద్రణా దుపరతం మంస్యంతే త్వాం
Page 120