సాంఖ్య యోగము
భగవద్గీత
ఒడ్డుకు వచ్చి విరిగిపోయిన తరువాత మరలా అదే తరంగం పుట్టుకు వచ్చిందని చెప్పలేము గదా. ఎప్పటికప్పుడు పోయేది పోతుంటే పుట్టేది పుడుతుంటుంది గదా. అలాగే పోయినవాడు పోతుంటే పుట్టేవాడు పుడుతుంటాడేమో. ఆ పోయినవాడు మరలా పుట్టాడని ఏమిటి నమ్మకమని అడుగుతాడా కుర్రవాడు. దానికాయన ఇచ్చిన సమాధానమేమంటే జీవాపేతం వావ కి లేదం మ్రియతే నజీవో మ్రియతే అని. జీవుడి ఉపాధి అయిన శరీరం మరణిస్తుందేగాని చైతన్య రూపుడైన జీవుడికి మరణం లేదు. అయినా వాడు తాను కర్తనూ భోక్తనూ అనే అభిమానం వదలకుండా పోయాడు కాబట్టి మరలా తాను చేసుకొన్న కర్మఫల మను భవించటానికి జన్మ ఎత్తవలసిందే నంటాడు.
ఇది ఏమి సమాధాన మనిపిస్తుంది మనకు. కాని ఇదే సరియైన సమాధానం. చేసిన పని ఎక్కడికీ పోదు. Action Produces reaction అని సైన్సు చెబుతున్నది. నీవు చేసిన పని మాసిపోవచ్చు. దాని సంస్కారం impression అలాగే నీ మనసులో నిలిచి పోతుంది. దాని ఫలితమను భవించటానికి మరలా దాని కనుగుణమైన జన్మ ఎత్తక తప్పదు. అంతేకాదు. Matter can neither be created nor destroyed అని అదే సైన్సు మరొక సత్యం బయట పెడుతున్నది. నా భావో విద్యతే సతః అని గీత ఎప్పుడో చెప్పిందీ మాట. ఉన్న పదార్థ మెక్కడికీ పోదు. ఏమీ కాదు. మహా అయితే దాని రూపం మరో రూపంలో ప్రత్యక్ష మవుతుంది.
Page 107