#


Index

  అది శివలింగమా కాదు, శివాకారవృత్తే అసలైన శివలింగం. " లీనం గమయతీతి లింగం" అది అఖండమైన జ్ఞానం.

  మార్కండేయుడు శివలింగాన్ని పోయి వాటేసు కొన్నాడంటే ఏమిటీ కథ ? ఏమి చెబుతుంది మనకు ? మార్కండేయుడు మృకండు మహర్షి కుమారుడు. పరమేశ్వర వరప్రసాద సంభూతుడు. కాని 16 ఏండ్ల వయస్సుకే కాలధర్మం చెందవలసి ఉందా కుఱ్ఱవాడు. దానికి ప్రతీకారం చేయాలని పోయి శివలింగాన్ని పట్టుకున్నాడు. యముడు వచ్చి కాలపాశం మెడకు తగిలించాడు తీసుకుపోవాలని. కాని శివలింగం వాటేసుకున్నాడు గనుక శివుడు ప్రత్యక్షమై కాలుణ్ణి పారదోలి అజరామరుణ్ణి చేశాడా బాలుణ్ణి.

  పదహారేండ్లేవో కావు. షోడశ కళాత్మకమీ ప్రపంచమే. దీనితో సంబంధం కాలం వల్లనే. అది తెగేది మనకు కాలం వల్లనే. అదే మృత్యువు. అదే కాలపాశం. కాలమనే పాశం. దాన్ని తప్పించుకొనే సాధనమే శివలింగా లింగనం. శివమైన తత్త్వాన్ని ప్రకాశింపజేసే భావనే శివలింగం. దాన్ని నిరంతరం గట్టిగా పట్టుకొని కూచుంటే మృత్యుభయం లేదు మానవుడికి. అమృతత్త్వాన్నే ప్రసాదిస్తుంది.

  అమృతమనేది ఎక్కడ ఉంది. అది సంసారంలోనే ఉంది. విషం లాంటి మృత్యువూ ఉంది ఇందులో. అమృతంలాంటి జీవితమూ ఉంది. మన జీవిత సాగరాన్ని మధిస్తే చాలు. రెండూ ప్రత్యక్ష మౌతాయి మనకు. ఒకటి మనకు ప్రతికూలం మరొకటి మనకు అనుకూలం. అనుకూలమే వాంఛనీయమైనా అది ప్రతికూలం పని చేస్తున్న వరకూ పూర్తిగా లభించదు. దానికి జవాబు చెబితేనే పూర్ణ సుఖానుభవం. ఏమిటది ? ఎలాగా ? హాలాహలం లాంటి కాలాన్ని కబళించి కాలాతీతమైన శివతత్త్వమే నా

Page 87