#


Index

22. ఇదె సంసారంబను పేరిట గుదిబండయి మెడకుఁజుట్టు కొనియెను నీకున్ వదలదు నీ య జ్ఞానము వదలక పీడించు చుండువఱకును సుమ్మీ

23. జ్ఞానమె నా స్వరూపమని చాటిన యప్పుడు. దాని నేనెటుల్ కానక విస్మరించితి - నఖండచి దాత్ముడనయ్యు నింద్రియ ప్రాణ మనశ్శరీరముల బంధములో నెటుచిక్కుకొంటి నో దీనికి నేమిటుత్తరము తెల్పుమటం చడుగం దలంచినన్

24. దానికి నుత్తరం బిడిరి తదులు నీకిపుడున్న యట్టి యీ జ్ఞానము నిర్విశేషమగు జ్ఞానము కాదు - విశేషరూపమీ జ్ఞానము - కానిచో నడుగఁజాలవు నీవొక ప్రశ్న దానికి E నేనును నుత్తరం బొసగనేరను సుమ్ము యథార్థ మారయన్

25. ఇది యెటులన్న ప్రశ్న యెపుడేర్పడెనో యపుడే యఖండతా స్పదమగు నీ స్వరూపమును బాసి తి ఎప్పుడెనేను నాదిగా జెదరి సఖండమై యొకటి జీవుడు వేరొకటీ జగత్తుగా సదమదమౌచు జూచెదవు సంసృతియన్ మృగతృష్టికాంభమున్

26. కావున వృత్తులేవియును కల్పన చేయక జ్ఞాన మాత్రమే నీవని చూతువేని ఒక నీవననేల సమస్త లోకమున్ నీవయితోచు - నప్పుడిక నేనును నాదను ద్వైత భేదసం భావనయే యభావమయి బంధ నివృత్తి తనంత నేర్పడున్.

Page 8