#


Index

స్వాతంత్య్ర దినోత్సవము

1. మరలన్ వచ్చె నిదే - స్వతంత్ర భరతాంబా జన్మ సంవత్సర స్ఫురితోత్సాహ సహస్ర దీధితి - మహః పూర్ణా ఖిలాశాంతమై మరలన్ హెచ్చెను - భారతీయ జనతా మాంగళ్య సంకీర్తనో ద్దుర నానాకవి కంఠకాహళము - లాతో ద్య ప్రతోద్యంబులై.

2. ఎంత శుభోదయం బయిన దీదిన మీ భరతావనీ ప్రజా సంతతి కంచు కొందఱ తి సమ్మదవీచులు తేలియాడగా ఇంతటి దారుణావసర మెన్నడు గాన మటంచు వేదనా క్లాంత మనోలతాంతులు విలాపము సేతురు కొంద రార్తులై.

3. బహు వస్తు జాల సంపద లీను వివిధ యం త్రములఁగూడిన పరిశ్రమము లేమి పలు ధాన్యములు రత్నములు పుష్ప ఫల సంత తుల నిచ్చు ఖనివనీ స్థలము లేమి గ్రామ పర్వత సరి ద్వ్యో మాధ్వముల మనో జవములై చనువాహ చయము లేమి అణు పరీక్షా చణ క్షణ సముత్ప్రేషిత గ్రహ మార్గగా మ్యుపగ్రహము లేమి.

4. శాస్త్రశోధన లేమి - విస్తార దూర సాగరాన్వేషణము లేమి - చర్చ సేయ అభ్యుదయ కారి కార్య దిశాభిముఖమె దేశ మిది – లేదు సందేహ లేశమిపుడు.

Page 9