17. అని వేదాంతులు మనకి చ్చిన యభయము - కాని సాక్షి చేతన యున్న ట్లను భవములేదు నాకీ తనువును ప్రాణంబు మనసు తప్ప విడిచినది.
18. అవునదిసత్య - మీ తనువు ప్రాణము నింద్రియ చిత్తవృత్తులే నవునని చూచు నంతవఱ కన్నియు నాకిటు గోచరించుచో నివి యెటు కాదు నేననుచు నించుక నీవు విమర్శ చేసితే నవలనే యుంటి వాకసము నట్లు నిరాకృతి వౌచునెల్లచో.
19. వాస్తవమయ్యు నాయనుభవంబున కేల ఘటిల్లదన్న నీ వస్తిమితుండవై కనునదంతయు కాంచెడునేనటంచు వ్య త్యస్తము గాగ చూచుటయే అందులకుంగల కారణంబు వాస్తవమైన రూపమున వాప్తము సేయక విస్మరించుటే.
20. అసలగు రూపముస్ మఱచి నప్పుడు నీకదె అస్యరూపమై మెసలుట తథ్య - మెట్ల నిన మేదినిపై బడు సూర్యరశ్మినీ విసుకపరం గనుంగొనిన నెత్తుగలేచిన యెండమాపులై వెస భ్రమగొల్పుగాదె యి వి వేలును లక్షలు జీవితంబులో.
21. నేనని యసలగు నాత్మ జ్ఞానము లేకునికి నదియె కాయము గా నీ ప్రాణేంద్రియములు గా నీ మానసముగ తోచు చుండె మహి సర్వముగా.
Page 7