11. పరమనికృష్ట జీవులని భావన సేయు సరీసృపంబులు = తరువులు - పక్షులుE మృగవితానము చూడగ నొండొకళ్ళతో నరమరలేక చాలవఱ కాదర మొప్పగ జీవయాత్రలో నిరతము సాగిపోవ నది నేరని మర్యుడుమేటి యెట్లగు
12. మన సొక్కటి యుండగనే గన నేరడు ఘనత - యుండగా వలయు వివే చన యందురు మన పెద్దలు. మను జున కదిలేక యెట్లు మహి జనియించె.
13. కొందఱకీ వివేకమొన గూడియు లేదు సుఖంబు - పుట్టువుం జెందిన యష్టు - రేపు మృతిజెందిన యప్పుడు కోలుపోవుచో నందఱు మానవుల్వలెనె యంత వివేకము కోలుపోయి యీ బొందిని మాత్రమే విడిచిపోయిరి సర్వము శూన్యమన్నటుల్.
14. కావున దీనికంతటికి కారణమేమని పట్టిచూచిన E భావన కందరానిదని భావనచేసియె తదులందరుE నీవనుకొన్న దంతయు సనిర్వచనీయ మటంచు బల్కి-రీ భావముతోడఁ జూడనిక ప్రశ్నయె లేదని తోచునెమ్మది
15. ఐవను ప్రశ్న వేయుటకు నా స్పద మున్నది - నిర్వచింపగా దీనిన శక్యమన్న - మరిదేనికి శక్యము - భావమున్ననే గాని యభావమంచు పలుకం జన-దింతకు నిర్వచింపగా దేనిని జూచి చెప్పెదరు - దీని న నిర్వచనీయ మంచిటుల్
16. సర్వము కాదు పొమ్మనుచు చాటిన యప్పుడికేది కావలెన్ నిర్వచనీయ - మున్న దొక నేనెగదా పరిశేష వృత్తిచే సర్వ వి లక్షణంబయిన సాక్షిని గావున నాకు గల్గదీ చర్విత చర్వణంబయిన జన్మవినాశ భయం బొకింతయు
Page 6