6. ఈ విధమున వారికి గల యా వేదన కధల నల్లి వ్యక్తము చేసెం గావలయును వాల్మీకియు నా వేదవ్యాసుడును మహాద్భుత ఫణితి .
7. అంతియకాని యీశ్వరుడె యార్తజనావను డుండెనేని యీ వంతున శాస్త్రవేత్తలును పాలక వర్గము తోడు దొంగలై దొంతరలైన యస్త్రములతో భువనాంతర జీవకోటి ది. గ్భ్రాంతులఁజేయగా తనది గాదని యూరక చూచుచుండునే.
8. మరి యీ సృష్టికి న్యాయ మేమిటిక ధర్మం బేమిట ప్రశ్నకు సరిగా నుత్తర మిచ్చుటెవ్వరికినే సాధ్యంబుగా - దింతకు సరిపెట్టన్వలె పూర్వజన్మకృత దుష్కర్మాను రూపంబె యీ పరితాపంబని - యుక్తి యుక్తముగ తోపంబోవ ద వ్వాక్యము.
9. సకల ప్రాణులు నొక్కమాటుగ వినాశం బొంద - వారెల్ల నిం తకు ముందేకముగా నొకేయొక మహాదౌష్ట్యంబు గావించిరో అకలంకంబగు గాదె యందఱకు నాద్యంబైన జన్మంబు దానికి తర్వాత కళంక మెట్లొదవె - నందెట్లేర్పడె భేదము
10. పాపపుణ్యంబులును సమభాగమైన మనుజ జన్మంబు ప్రాప్తించు ననుచు జెప్పు శాస్త్ర- మటులైన మృగపక్షి జాతికంటె హీనమగు మానవుల జాతి యెట్టులొదవె
Page 5