ఆత్మ విమర్శ
1. మానుషజన్మమెత్తియు - నమానుషకృత్యము లాచరించు నీ మానవజాతి యెన్న డిక మంచికి నర్థమెఱుంగు - నెన్నడీ దానవ చేష్టితం బుడిగి దైవ గుణంబుల నభ్యసించు - నీ శానుడె వచ్చిచెప్పినను సంభవమంచు దలంప నెప్పుడు.
2. ఆయీశాను గాదెయిచ్చె మనకా హామీ యితః పూర్వమే చాయం దుష్కృతు లుద్భవింతురు వినాశంబేను కల్పింతుఁబొ మ్మాయా వేళలనంచు నా శపధమేమాయెE సమస్త ప్రజా శ్రేయో ఘాతిపరశ్శతాధికరిపు శ్రేణి విదారింపఁగ.
3. అప్పుడెగాని యిప్పుడది యక్కఱరాని ప్రతిజ్ఞయాయెనో చెప్పుటగాదు చేయవలె - చేతకు మాటకు పొంతనంబులే కొప్పమి యీ సరాధముల కుండిన నుండగ వచ్చుగాక యీ తప్పిదమా పరాత్పరుడె తానెటు లాడగనేర్చె నీశుడై.
4. ఈశ్వరుండాడె ననిగాదు - ఈశుడాడే నని యొకానొక మహితాత్ము డనినమాట మహితచిత్తుడై గావచ్చు మౌనివర్యు డైన గావచ్చు. నతడును మానవుండె.
5. మానవు లందఱి జగతి మారణయంత్ర కృత ప్రమాద వీ క్షానాల దగ్ధచిత్తులయి యాత్మలనిట్టు తపించి యుందు-రీ శాను రామకృష్ణ త ను సంహతి దాల్చి కృతావతారుడై యీ నరరూప రాక్షసుల నెల్లవధించె నటంచు నార్తులై.
Page 4