యోగ మంటే ఏమిటి
యోగమనే మాట చాలా తరుచుగా మనం వినే మాటలలో ఒకటి. ఎంత తరుచుగా ఈ శబ్దం మన చెవిలో పడుతుంటుందో దాని అర్ధమంత అరుదుగా మనుసుకు వస్తుంటుంది. ఖచ్చితంగా ఇదమిత్థమని నిర్ణయించలేక పోతున్నాము. మీ యోగక్షేమాలు బాగున్నాయా అని అడుగు తుంటాము. వాడికి మంచి యోగం పట్టిందంటాము. వీడి యోగం బాగా లేదంటాము. ఇలాంటి లోక వ్యవహారం దగ్గరి నుంచి యోగాభ్యాసం యోగసిద్ధి అనే శాస్త్ర వ్యవహారం వరకూ ఎంతైనా ఉంది దీని క్షేత్రం. ఎక్కడ ఏ అర్ధంలో వాడు తుంటామో ఈ శబ్దాన్ని మనకే తెలియదు. ఆ మాటకు వస్తే ప్రామాణికమైన గ్రంథాలలోనే అంతుపట్టని వ్యవహారమిది.
భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలకూ, పద్దెనిమిది యోగాలని పేరు పెట్టాడు వ్యాస భగవానుడు. చిత్రమేమంటే విషయాలెక్కడి కక్కడ మారుతున్నా అన్నింటినీ యోగమనే పేర్కొంటాడాయన. విషాదమూ యోగమే కర్మా యోగమే - జ్ఞాన విజ్ఞానాలూ యోగమే. అది ఎలా సంభవం. అంతేకాదు. మధ్యలో అక్కడక్కడా యోగ శబ్దానికి నిర్వచనం కూడా ఇస్తూ వచ్చాడు మహర్షి "యోగః కర్మసు కౌశలమ్ ” పనులు చేయటంలో చాతుర్యమే యోగమంటా డొకచోట. " సమత్వమ్ యోగ ఉచ్యతే ” సుఖదుఃఖాది ద్వంద్వాలను తేడా లేకుండా చూడటమే యోగమంటాడు మరొకచోట. “యోగక్షేమం వహామ్యహమ్ ” యోగక్షేమాలు రెండూ ఇస్తానంటా డింకొక చోట. “దుఃఖసంయోగ వియోగం యోగ సంజ్ఞ్గతమ్” దుఃఖయోగం లేక పోవటమే యోగమని చమత్కారంగా వర్ణిస్తాడొక చోట. పోతే " జ్ఞాన యోగ వ్యవస్థితిః ” అని వ్యాస భగవానుడు
Page 79