#


Index

  అంటే ఈ భూత గణానికి తా న ధీనుడు కాను. అధిపతిననే సత్యాన్ని గుర్తు చేసుకోవాలి. చేసుకొంటే తన తల్లిదండ్రుల లాగా తానూ సర్వజ్ఞుడు సర్వక్రియా సమర్థుడు అనే సత్యం కూడా అనుభవానికి రాగలదు. ఆ వచ్చినపుడే అతణ్ణి బుద్దీ వరిస్తుంది సిద్దీ వరిస్తుంది. మామూలు బుద్ది కాదది - మామూలు సిద్ధికాదు. మహాబుద్ధి మహాసిద్ధి. తద్వారా గణపతి కూడా మహాగణపతి అవుతాడు.

  అయితే అది భాద్రపదం, శుక్లపక్షం. భద్రమైన పదం భాద్ర పదం. శ్రేయస్కరమైన స్థానం. జీవిత గమ్యమైన మోక్షమే అది. కృష్ణమైన ధూమ మార్గం కాదది. శుక్లమైన తేజోరూపం. అందులోనూ చతుర్థి, జాగ్రత్, స్వప్న సుషువులనే మూడవ స్థలనూ దాటిపోయిన తురీయావస్థ. నిర్వికల్ప సమాధి. అందులో కూచున్న మహాగణపతిని చూచి ఇక ఏ చంద్రుడూ పరిహసించ లేడు. అసలు చంద్రుడే లేడిక్కడ. మనసే కదా చంద్రుడంటే. మనసనేది లయమైన అమనస్కదశ సమాధి. అలాంటప్పుడు మనో రూపుడైన చంద్రు డెక్కడున్నాడు నవ్వటానికి. చంద్రుడే లేనపుడు నీలాపనింద లెక్కడున్నాయి కంగారు పడటానికి. ఉన్నాయి అంటే అవి ఆ సమాధి స్థితి నోచుకోలేని లౌకికులకైనా ఉండాలి లేదా అది సిద్ధించినా అందులో నుంచి జారిపడే యోగభ్రష్టులకైనా ఉండాలి. సకల భూత గణవాసనలకూ స్వస్తి చెప్పి పూర్ణ జ్ఞాన బలంతో వాటిని వినయంచేసి అసలైన గాణాపత్యం సాధించిన మహాగణపతికి లేవు.

  "గణానాంత్వా గణపతిగ్ం హవామహే" ఇలాంటి మహాత్ముడే మానవలో కాని కంతా ఆచార్య పురుషుడు. “ ఆచార్యదేవో భవ” అన్నారు. అలాంటి దేవతనే ఆవాహనం చేయాలి మనం. ఆసనం సమర్పించాలి. ఎక్కడ ? మన హృదయాలలో. అర్పించాలా యనకు. ఏమిటి ? పత్ర పుష్ప ఫలాలను. అంటే శరీర మనః ప్రాణాలను. ధ్యానం చేయాలి. ఎలాగా.

Page 77