ఈ గణాని కంతటికీ విలక్షణమూ సాక్షి భూతమే గాక అధిష్ఠాన రూపంగా దీనిలోని ప్రతి అణువునూ వ్యాపించింది కూడా అదే. విశ్వాతీతమూ, విశ్వమయమూ కూడానని భావం. అప్పుడే అది పరిపూర్ణమైన తత్త్వం.
మొత్తం మీద “బాల” నుంచి “మహా” వరకు వ్యాపించి వున్నది. గణపతి తత్త్వం. అణోరణీయాన్ బాల అయితే; మహతో మహీయాన్ అనునది మహాగణపతి. కాగా మధ్మలో ఉన్న ఏడు భూమికలు ఆ రెండు కొసలను కలిపే ఒక గొప్ప సేతుబంధం. అవి క్రమంగా మానవుడికి ఉత్సాహ, వీర్య, విభూతి, సిద్ధి, ప్రకాశౌన్నత్య సర్వ సాక్షిత్వాలనే గుణాల నందజేసి జీవితలక్ష్యమైన అమృతత్త్వాని కర్హుణ్ణి జేస్తాయి. ఆ దేవతకేది లక్షణమో యీ సాధకుడికది ప్రయత్న సాధ్యం. ప్రయత్నం చివరకు ఫలిస్తే నిజమైన గాణపత్యం లభిస్తుంది మానవుడికి. ఇది గణేశ చతుర్థినాడు బుద్ధి జీవులమైన మన మందరమూ భావించవలసిన గణపతితత్త్వం. నవవిధ గణపతుల మూర్తి కల్పనలో దాగిఉన్న ప్రతీకత్వం.
Page 73