#


Index

  త్రిపురసుందరి అంటే అమ్మవారే కదా. బాల గణపతి రూపంగా కూడా అదే భాసిస్తున్నది. రెండవది నృత్య లేదా నాట్య గణపతి. ఆ బాల తన లోకోత్తర ప్రభావంతో ఈ విశ్వమంతా వ్యాపించి నాట్యం చేస్తున్నది. ప్రమోదభరతుంది లప్రమథ దత్తతాళావళీ. వినోదిని వినాయకే డమరుడిండి మధ్వానిని, అని పండితరాయల వర్ణన. వినాయకుడి తాండవమేదో కాదు. సర్వజగద్వ్యాపన వ్యాపారమే. మూడవది వీర గణపతి లేదా విద్యా గణపతి. 'విద్యయా విందతే వీర్య' మని చాటుతున్న దుపనిషత్తు. కేవల మాత్మ జ్ఞానమే అది. మరేది కాదు. నాలుగవది లక్ష్మీ గణపతి. విద్యా వీర్య మెప్పుడేర్పడిందో అదే లక్ష్మి సాధకుడికి. పారమేశ్వరమైన విభూతే లక్ష్మి. అది పరమాత్మను లక్షింపజేస్తూ ఆయనకు లక్షణమౌతుంది. బ్రహ్మజ్ఞానం చేతనే సమకూరుతు ందది. సర్వ ప్రపంచమూ జ్ఞాన వైభవమేననే దృష్టి. అయిదవది సిద్ధి గణపతి జ్ఞానైశ్వర్యాలు రెండూ పిలిస్తే పలకటమే చివరకు మనమాసించే సిద్ధి. ఆరవది అర్క గణపతి లేదా శ్వేతార్క గణపతి. అర్కమంటే జిల్లేడు. శ్వేతార్కం తెల్ల జిల్లేడు. ఒక వంద సంవత్సరాలు గడిస్తే దాని వేరు గణపతి రూపం ధరించి కనపడుతుందట. ఆట కాదది అనుభవసిద్ధమే. ఇక్కడ సంకేత మేమంటే సాధకుడికి కలిగే ఆ సిద్ధి శ్వేతమూ అర్కమూ. శ్వేతమంటే తెల్లని స్వచ్ఛమైన; అర్కమంటే సూర్య ప్రకాశంలాగా వెలిగిపోయే చైతన్యమని అర్థం. పోతే ఏడవది ఊర్ధ్వ గణపతి. అలాంటి జ్ఞాన ప్రకాశం నామ రూపాత్మకమైన తమోరూపమైన యీ సృష్టికి విలక్షణంగా దీని నతిక్రమించి భాసిస్తుంది కనుక ఊర్ధ్వం. ఎనిమిదివది సాక్షి గణపతి. అలా భాసించటమే గాక మరలా యీ సృష్టికంతా సాక్షిగా నిలిచి దీన్ని భాసింపజేస్తుంది కూడా. అప్పుడే దీని కస్తిత్వం. పోతే ఇక తొమ్మిదవది ఆఖరిది మహా గణపతి.

Page 72