కెక్కడివి తొమ్మిది రూపాలని ప్రశ్న. గణపతి పరమేశ్వరమైన శక్తి అని ఎప్పుడన్నామో ఆ తొమ్మిదే యీయనకు చెప్పినా చెప్పవచ్చు. భూమి రాపోనలో వాయుః ఖం మనో బుద్ధి రేవచ అహంకారః అని అపరాప్రకృతి ఎనిమిది విధాలు. ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధిమే పరాం - సమష్టి జీవుడైన హిరణ్య గర్భుడు పరాప్రకృతి వెరసి తొమ్మిది ప్రకృతులు. ఇవే నవావరణలు. నవయోనులని గూడా పేర్కొంటారు తాంత్రికులు. బిందువు నుంచి భూపురం దాకా శ్రీ చక్రంలో విస్తరించి ఉన్నవి తొమ్మిదే. బాహ్యాభ్యంతర సృష్టి అంతా యీ తొమ్మిదింటిలోనే సమసిపోతుంది. ఇది గణమైతే దీనికి పతి ఆ మూల ప్రకృతే ఆ మహశక్తే.
అయితే ఏమిటా తొమ్మిది రూపాలింతకు ? అసలు తొమ్మిదింటిలో ఒకటి మినహాయించి ఎనిమిదేనని పేర్కొంటారు గణపతి రూపాలు. అష్టలక్ష్ముల లాగా అష్టగణపతులనే పరిగణిస్తారు. పూనే దగ్గర అష్టగణపతి దేవాలయం కూడా వుంది. ఆ మాటకు వస్తే 32, 36, గణపతులను కూడా వర్ణిస్తారు. శైవాగమాలలో దేవీ భాగవతంలోనూ అంతమంది గణపతు లున్నప్పుడు తొమ్మిదింటిని పరిగణించటంలో అభ్యంతర మేముంది. ఎటువచ్చీ ఏ తొమ్మిదింటిని తీసుకుంటే ఇటు ముందు చెప్పిన నవ ప్రకృతులకు అటు మోక్ష సాధన మార్గానికి తోడ్పడుతుందో అవి తీసుకోవటమే సబబు. గణమనేది ప్రపంచమూ గణపతి విరాడ్రూపుడైన పరమాత్మకు ప్రతీకమని ఎప్పుడన్నామో అప్పుడే నవవిధ గణపతుల రూపాలూ ఆ గమ్యాన్ని చేర్చే సోపానపరం పరగా మనం వ్యాఖ్యానించవచ్చు.
ఇందులో మొట్టమొదటి భూమిక బాల గణపతి బలమే బాల అన్నారు భాష్యకారులు. పరమాత్మ శక్తికే బలమని
Page 71