మరొక మాటలో చెబితే దీని విలువలు ఆదర్శాలు తదితరములైన అన్ని వ్యవహారాలు ఆ మూలతత్త్వంలోనే ఉంటాయన్న మాట. అవే మరల సృష్టి కాలంలో ప్రకారాంతరంగా వ్యక్త మౌతూ వస్తాయి. ఇంతకూ మనం గ్రహించ వలసిందే మంటే ప్రకార మంటున్నామే Mode or Model సృష్టిలో - అదే మారుతుంది కాని ఆ విలువలు మారవు. అంటే ధర్మాధర్మాలు - రాగ ద్వేషాలు. ప్రాణుల మనస్తత్వాలు, ప్రవర్తనలు ఇలాంటి నిసర్గ లక్షణాలు మాత్రమలాగే నిలిచిపోతాయని భావం. 'ధాతా యథా పూర్వమ కల్పయత్' అని వేదం చెబుతూ ఉన్నది. బ్రహ్మ దేవుడు ఇంతకు ముందు మాదిరే ఇప్పుడు కూడా సృష్టించాడట ఈ లోకాన్ని.
మరి ముందు మాదిరే సృష్టి చేస్తూ పోతే ఏమి సుఖం. అది పాత పంచాంగమే కదా క్రొత్త దనమేముంది అని ప్రశ్న వస్తుంది. ఉంది. క్రొత్త దనం కావలసినంత ఉంది. ప్రాతలోనే ఉంది క్రొత్త. ప్రాత సామగ్రి మాత్రమే. ఆ సామగ్రి నాధారం చేసి కొని చేసే రచన క్రొత్తది. సిమెంటు, రాయి, ఇటుక, సున్నము, ఇనుము, కొయ్య ఇలాంటి పరికరాలన్నీ అన్ని ఇండ్లకూ సమానమే. కాని ఒక ఇంటి కట్టుబడి లాగా వేరొకటి ఉండదు. దేని అందం దానిదే. దేని చందం దానిదే. రచన అనేది ఇది. సృష్టి సామగ్రి ఒక్కటే ఐనా రచనలో వైచిత్రి ఉంటుంది. ఆ వైచిత్రితోనే అది ఎప్పటికప్పుడు నవనవోన్మేషంగా ప్రకాశిస్తూ పోతుంది. అలా నూతనంగా భాసిస్తున్న దాని పొరలలో అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉన్న ఆయా సత్యాలు మాత్రం ప్రాచీనాలే. కారణం అవి సార్వకాలికాలు, సార్వత్రికాలు కావటమే.
చూడండి. కృత యుగంలో దేవ దానవుల యుద్ధాలు జరిగాయి. అవి పురాణాలలో బ్రహ్మాండంగా వర్ణించారు కవులు. అదే త్రేతా యుగంలో
Page 60