కవితా - పితామహుడ వెవ్వరీడు పేర్కొన నీకున్ - అని రాయలు తన్నా నామధేయంతో సంబోధించినట్టు వ్రాసుకొని మురిసిపోతాడు. ఆఖరుకు రాయల వారస్తమించిన తరువాత కూడా ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దన అటంచుతన్ను నిత్యమూ ఎంతో ప్రేమతో పిలిచే రాయలతో దివి కేగ లేక బ్రతికి యున్నాడ జీవచ్చవంబనగుచు అని పరితపిస్తాడు. ఇంతకూ ఏమిటీ ఆంధ్ర కవితా పితామహ అనే మాట కర్ధం.
పితామహ అంటే తాత అని అర్ధం. నిజమే. పెద్దన అంటే అందరి కంటే పెద్దవాడు గనుక తాత అని పేర్కొన్నా తప్పులేదు. ఐతే ఇది మనం సరదాగా చెప్పుకునే అర్ధమనుకోండి. తాత అంటే ఈ చరాచర సృష్టి కంతటికీ తాత ఒక్కడే ఉన్నాడు. తాత అయినా ఆయనే ధాత అయినా ఆయనే. ఎవడాయన. బ్రహ్మ దేవుడు. బ్రహ్మ ప్రపంచాని కంతటికీ సృష్టి కర్త. అలాగే ఆంధ్ర కవితా ప్రపంచానికి సృస్టి కర్త ఎవడో వాడే ఆంధ్ర కవితా పితామహుడు.
ఐతే ఆంధ్ర కవితా పితామహు డేమిటి పెద్దన. పితామహుడు అంటే సృష్టికర్త అని కదా చెప్పారు. ఆంధ్ర కవితా ప్రపంచాన్ని సృష్టించాడా పెద్దన. లేదే. అది సృష్టి అయిన ఎన్నాళ్లుకో వచ్చాడు రంగంలోనికి. మనకు తెలిసినంత వరకూ భట్టు మూర్తి చెప్పినట్టు ఈ బహుళాంధ్రోక్తి మయ ప్రపంచాన్ని సృజించిన వాడు నన్నయ భట్టారకుడు. అంచేతనే ఆయనను వాగను శాసను డన్నారు పెద్దలు. అంతేకాదు. కవి బ్రహ్మ అని మన మీనాడు కీర్తించే తిక్కన గారు గూడా ఆనాడేమన్నాడో తెలుసా. అందాది దొడంగి మూడు కృతు లాంధ్ర కవిత్వ విశార దుండు విద్యా గయి తుండొ నర్చె మహితాత్ముడు నన్నయ భట్టు దక్షతన్ అని చెబుతూ విద్యా దయి
Page 58