#


Index

తమ ప్రయాణం సాగించవలసి ఉంటుంది. కాకుంటే ఆ గమనం నిర్లక్ష్యమూ అ గమ్యమూ కాక తప్పదు. అప్పటికీ సత్య సౌందర్యములనేవి గమకమైతే శివ మనేది గమ్యం. రెంటికీ గమ్య గమక భావమనే గాఢమైన సంబంధముంది. మరొక మాటలో చెబితే శివ మనేది ఆవలి తీరం. సత్యం దాని కీవలి తీరం. రచనాగతమైన సౌందర్యమీ రెంటినీ కలిపే ఒకనొక అందమైన సేతుబంధం. సత్యం సౌందర్యం ద్వారా శివాన్ని సాధిస్తుంది. సత్య శివ సుందరముల కున్న ఇలాంటి ప్రగాఢమైన సంబంధమే నిజమైన ప్రబంధం. వాటి పరస్పర సాహిత్యమే సాహిత్యం. అది దృష్టిలో ఉంచుకొని కవి చేసిన సృష్టే కావ్యం. కనుకనే అది సహృదయ సంభావ్యం.









★★★

Page 54