తన్మూలంగా మహర్షుల తపః ప్రభావమూ దాని మూలంగా అక్కడి పరిసరాల్లో బ్రతికే జంతుకోటికి కూడా నేర్పకుండానే అలవడిన శమ దమాది గుణ సంపత్తీ - తద్వారా రజః ప్రధానులైన మానవులు కూడా ఎలా సాత్త్విక గుణగణాలను అభ్యసించి బాగు పడాలనే మహోపదేశమూ ఇలాంటి మహోన్నత భావాలనెలా రంగరించి మనకు కర్ణ రసాయనంగా అందిస్తున్నదో చూడండి ఈ వర్ణన.
33. "కలలం బోలెడి పుత్రమిత్ర వనితాగారాది లక్ష్మీ పతీ"
ఇది శ్రీ కృష్ణుని ద్విపాత్రాభినయము చూచి అబ్బురపాటు చెందిన అక్రూరుని ఆ క్రందన. దేహి పుత్ర కళత్రాది సంసార యాత్రతోనే సతమత మవుతున్నాడు. పోనీ అది శాశ్వతమా అని చూస్తే కాదు. అంతా ఒక కలవంటిది. చూచినంతసేపే గాని మెలకువవస్తే ఏమీ లేదు. ముహూర్తమాత్రమైన ఆ సుఖం కోసం మృగతృష్ణా జలం కోసం పరువుతీసినట్టు తీస్తున్నాడు మానవుడు. ఏమిటీ జీవితం ది దీనికి గమ్యం. నీ పదయుగం తక్క వేరొక్క పదమేది మానవులకు, మొత్తం మానవ జీవితమంతా ఆకళించి దాని నిస్సారతను మన ముందు పెట్టి గాఢసుప్తులమైన మనలను తట్టి లేపే ఈ మాటలలోని తీవ్రత చూడండి ఎంత సూటిగా వచ్చి మనసును తాకుతున్నదో.
'కంజాక్షునకు గాని కాయంబు భస్త్రి గాక'
వట్టి ఆడంబరాలకూ ఆత్యాశలకూ పోయి ఈ ఉన్న కొంచె పాటి జీవిత కాలాన్నీ వంచన చేసుకోకండి - ఉన్నంతలో తృప్తి పడి
Page 51