#


Index

సంకల్పాలలో ఒకటి సృష్టి కు న్ముఖమైతే దానిలో నుంచి స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టి దీనిలో కోటాన కోట్ల భూతజాలముంటే అందులో ఒక దేవయోనులూ వారిలోనూ మాలాంటి ఒక - వ్యక్తి నీ మహిమ కొని యాడాలంటే ఎంతనగు బాటు పంచాంగమిది. అయినా స్తోత్రం చేస్తున్నామంటే ఇది మా ప్రజ్ఞగాదు మీ ప్రభావమేనని పలుకుతారు. ఎంత గంభీరోదాత్తమైన భావమో చూడండి ఇది. మొదటిది పరమాత్మ విశ్వతోముఖమైన రూపాన్ని మలిచి చూపితే రెండవది దానిపై చూపు నిలపలేక అలమటించే మానవుడి వాక్యాన్ని కొలిచి చూపుతున్నది.

32. 'పవనవేగ విశీర్ణ పాదపాగ్రంబుల - జడియకుండఁగ బట్టు సామ జములు - పూజార్ధ నియమిత పుష్పవాటికలపై - మధుకరంబులఁ జోపు మర్కటములు' హోరుమని వీచేగాలికి చెట్లుకదలటం ఊగటం విరిగిపడి పోవటం కూడా కద్దు. అలా పడకుండా ఏనుగలే పట్టి నిలుపుతున్నాయట. మరి పూలతోటలలోనే తిరుగుతుంటాయి ఎప్పుడూ తేనెటీగలు.

పూలలో స్రవించే మకరందం సేకరించటమే గదా వాటి ఉద్యోగం. మహర్షుల పూజకు కావలసిన ఆ పుష్పాలపయి అవి కాలుమోపి కలుషితం చేయటం ఇష్టం లేని మర్కటాలు ఆ మధుకరాలను కనిపెట్టి దూరంగా తరుముతున్నాయట. ఏమిటీ వర్ణన - ఎక్కడిది. సోమనాధుని హరివంశంలోనిది. బదరికాశ్రమ వాసులైన తాపసుల ఆశ్రమ పరిసరాలను వర్ణిస్తున్నాడు కవి. ఏనుగు లెక్కడైనా చెట్లను బ్రతకనిస్తాయా - వానరాలు పువ్వుల నుండనిస్తాయా. అలాంటి స్వభావమున్న అవే మరొక దాని దాడి జరగకుండా వాటిని కాపాడుతున్నాయంటే వింతే,

Page 50