#


Index

అందుకే ఆయనను పెరియాళ్వారని పేర్కొన్నారు సంప్రదాయజ్ఞులు. మన్న నారు సేవకే అంకితమైన జీవిత మా మహనీయునిది. విద్యా గంధం లేకపోయినా భగవద్భక్తి సుగంధం ఎంతగానైనా గుబాళిస్తూ ఉన్న మహా భాగవతుడు విష్ణు చిత్తుడంటే. అలాంటి వాడికి మన్ననారు అనుగ్రహంతో పాండ్యరాజు కొలువులో ఉన్న విద్వాంసులను వాదంలో గెలవట మొక బరువైన పనికాదు. అయినా నాపయి అంతబరువు మోపవద్దు. నేనోపనంటాడా అమాయిక బ్రాహ్మణుడు. ఎప్పుడూ నేను చేయగల పనులే నాకొప్పజెప్పు. అవి తాము చెప్పి నా చెప్పకున్నా నేను ఉత్సాహంతో చేయగలనంతే గాని నాకీ వాదాలూ విజయాలూ దేనికి. కావాలంటే మరి ఎవరైనా మేధావంతులుంటే వారికప్పగించు స్వామీ నేను అపఠిత శాస్త్ర గ్రంధుణ్ణి జనుషాంధుణ్ణని మనవి చేసుకుంటాడు మన్ననారుకు. చూడండి ఈ మాటలలో ఎంత వినయం - ఎంత సేవా బుద్ది ఎంత నిష్కల్మషతా ఎంత నిరావడంబరతా కొట్టవచ్చినట్టు కనిపిస్తుందో. ఒక మానవుడిలో ఉండే ఇలాంటి ఉదాత్త భావాలను వింటున్నప్పుడు మనం కూడా ఇలాంటి ఉత్తమ భావాలనే అలవరుచుకొని జీవిత మార్గాన్ని శుభ్రం చేసుకోవాలనే అభిప్రాయం ఏర్పడటాని కెంతైనా అవకాశముంది.

28. ఇలాంటిదే మరొక ఉదాహరణ చూడండి.
"నిరయంబైన నిబంధమైన .ధీవర్య వేయేటికి”

ఇవి బలి చక్రవర్తి శుక్రుడితో అన్న మాటలు. వచ్చినవాడు ఎవడోగాదు. సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు. యాచన అనే నెపంతో నీ సర్వస్వమూ అపహరిస్తాడు. కాబట్టి ఈ దానం చేయవద్దు మానుకో మని హెచ్చరించాడు ఆ చార్యుడు.

Page 44