#


Index

ఈ శివ మనే మూడవది వాటి రెంటికీ మించిన ఒకానొక అనిర్వచనీయమైన ఆత్మతత్త్వం. మనకు శరీరమూ - ప్రాణమే గాక తద్విలక్షణమైన ఆత్మ Self ఒకటి ఉందనే అంశం మరచిపోరాదు. అది దేహ ప్రాణాలను రెంటినీ ఆవరించి ఉంది. ఎంతగా ఆవరించి ఉందంటే అది వినా వీటి కస ల స్తిత్వమే లేదు. దాని కోసం పుట్టాయివి. దాని కోసమున్నాయి. చివరకు దాని లోనే లయమవుతాయి. అది వీటి కామూలాగ్రమూ నియామకం దాని చెప్పు చేతలలో నడచినప్పుడే ఇవి చరితార్ధం. లేకుంటే వీటికి విలువలేదు. ఏమి కారణం. ఇవి కావ్యానికి స్వరూప Substance మైతే అది ప్రయోజనం. ప్రయోజనానురోధిగా స్వరూపం గాని స్వరూపానుసారిగా ప్రయోజనం కాదు. ఒక ప్రణాళిక వేసుకొని మన మిల్లు కడతామా. ఇల్లు కట్టి ప్రణాళిక వేసుకుంటామా. కాబట్టి కావ్య ప్రపంచ నిర్మాణ ప్రయత్నంలో ఏ వస్తువైనా ఏ సన్నివేశమైనా ఎలాంటి రచన అయినా తన్మూలంగా ఆ కవి ఆదించే ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని సాగాలే గాని మరో విధంగా సాగటానికి వీలు లేదు. ఇదుగో ఈ ప్రయోజనమే శివ మనే మాట కర్థం.

14. శివం హితం శ్రేయం - కల్యాణం - వీటన్నిటికీ ఒక్కటే అర్థం. శివేతరక్షతయే అన్నారు ఆలంకారికులు. శివేతర మంటే అ శివం. అ శివాన్ని శమింపజేసే దేదో అది శివేతరక్షతి. అది కావ్యానికి ప్రయోజనమట. పోతే విశ్వశ్రేయః కావ్య మని జగద్ధితమ్ కావ్యమని మహాకవులెంతగానో వర్ణిస్తూ వచ్చారు. ఆఖరుకు శాస్త్రజ్ఞులు కూడా శాస్త్ర స్వరూపాన్ని వర్ణిస్తూ మంగళాదీని

Page 28