#


Index

ఇలా భావన చేసే కొద్దీ ఎన్నో సుందరమైన కళా రహస్యాలు ముద్దుగా స్ఫురిస్తూపోతాయి ఇందులో, సత్య సౌందర్యాలకు రెండింటికీ మందిరమైన ఇలాంటి పద్యాలు లోకంలో మహాపురుషుల లాగా సాహిత్య లోకంలో మనకెక్కడో గాని దర్శనమీయవు.

12 ఇంతకూ సాహిత్యరంగంలో సత్యమంటే ఏమిటో - సౌందర్య మంటే ఏమిటో తడవి చూచాము. రెంటికీ ఉండే ప్రగాఢమైన మైత్రిని కూడా పరిశీలించాము. ఈ మైత్రి ఎలాంటి దంటే ఒక ద్రవ్యానికీ దాని ఆకృతికీ ఉండే మైత్రిలాంటిది. బంగారం ద్రవ్య Substance మైతే కటక ముకుటకే యూరాద్యలంకారాలు దాని ఆకృతి. బంగారమెంత విలువగల దైనా వట్టి బంగారు ముద్ద ముద్దు గొలుపదు. దానినేదో ఒక ఆభరణ రూపంలో దర్శిస్తేనే అందం. అలాగే ఆకృతి ఎంత మనోజ్ఞమైనా అది బంగారంతో గాక ఏ కొయ్యతోనో నిర్మిస్తే హంగురాదు. దానికి విలువ ఏముందనే పేలవ భావమొకటి మన డెందాన్ని పీడిస్తుంటుంది. రెండూ రెండే. ఆకృతిలేని ద్రవ్యం అనాకర్షకం. మంచి ద్రవ్యం గాని ఆకృతి అనుత్కర్షకం. సువర్ణంలాంటి ఉజ్జ్వలమైన ద్రవ్యమూ కావాలి సుందరమైన ఆభరణం లాంటి ఆకృతీ కావాలి. అప్పుడే అది సహృదయ హృదయ దేశాన్ని అలంకరించటాని కర్హమవుతుంది. సత్య సౌందర్యాలకు రెంటికీ మధ్య ఉండే అనుబంధ మిలాంటిది. రెంటికీ అవినాభావ సంబంధం.

13. ఇంత మాత్రంతోనే సమసిపోలేదు సాహిత్య సౌధ నిర్మాణం. వాటి రెంటికీ తోడు మూడవది మరొకటి ఉంది. దాని పేరే శివం. అవి రెండూ ఒకటి సామగ్రి - ఇంకొకటి దాని కట్టు బడి అయితే

Page 27