#


Index

కందుకము పోలె సుజనుఁడు క్రిందంబడి మగుడ మీఁదికి న్నెగయుఁజుమీ మందుఁడు మృత్పిండమువలెఁ గ్రిందంబడి యడఁగియుండు ఁగృపణత్వమునఁ

చూడండి ఈ పద్యంలో కవి సుజన మూఢజనుల స్వభావ వైషమ్యాన్ని ఒకచక్కని ఉపమాలంకారమనే నేపథ్యం మీద ఎంత చమత్కారంగా చిత్రించి చూపాడో ! ఇలాగే శైలిలో చూపిన మరి ఒక పద్యాన్ని తిలకించండి.

విదలింప నుఱుకు సింగపుఁ గొదమయు మదమలిన గండ కుంజరములపై నిది బలశాలికి నైజము

గద ! తేజోనిధికి వయసు కారణ మగునే । ఇందులోనూ అలంకారం లేక పోలేదు. కాని దానిని మించి ముందుగా వచ్చి సహృదయుడి డెందాన్ని తాకేది అందులోని శైలి. అది ఆరోహణావరోహణాత్మకం. పద్యం పూర్వార్థంలో ఆరోహణ. ఉత్తరార్థంలో అవరోహణ. సింగపు కొదమ ఎగిరి దూకుతున్నట్టు వర్ణించే పట్టున ఆరోహణ తేజోనిధికి సహజమని ఒక లోక ధర్మాన్ని చాటే చోట అవరోహణ పాటించటం రచన కెంత మెఱుగు పెడుతున్నదో రసికజనైక వేద్యం.

7. మరి ఛందో రీతిలోనే అందాన్ని చిందించటం అంతా ఇంతా కాదు. సంగీతంలో రాగాల లాగా ఎన్నో వందలు వేలున్నాయి భాషలో ఛందస్సులు.

Page 21