#


Index

నీవె పరయన- పశ్యంతి నీవె- నీవె మధ్యమయు- వైఖరియు నీవె- మదిదలంప నీవుగానిది కలదె యీ నిఖిలజగతి, నిఖిలజగతియు నీవేకా నీరజాక్షి,

ఒకకేల నవనవోద్యోగ యోగవిభూతి నెనయించు పుస్తక మ్మొనరఁదాల్చి, ఒక హస్తమున చిరాభ్యుదయదాయక శతా ధికసంచితాక్షమాలిక ధరించి, ఒకకరమ్మున చకచ్చకితకాంతిగుళుచ్ఛ మననొప్పు రామచిల్కను వహించి, ఒకపాణి సలిలవేణిక భక్తిఁగొనితెచ్చి యిడిన కాంచనపద్మ మిరియఁజేర్చి,

ధర్మకామార్థ మోక్షప్రదాత్రి ననుచు, నాల్గు పురుషార్థములు దాల్చి నాల్గుకేల, నీవు సాక్షాత్కరింపనో దేవి మాకు కామితార్థంబు లికనేమి గలుగు చెపుమ.

Page 2