సరస్వతి నమస్తు భ్యమ్
శారద, శారదాంబురుహ చారుతరాస్య, మదాస్య గేహసం చారము సేయుఁగాక తనసన్నిధి సన్నిధియై- దయామృతా సారమువోని సౌఖ్యములు సర్వదయై యిడి నన్ను సర్వదా పారము జేర్చుఁగావుత మపార భవాంబుధి మగ్న మానసు.
శరణన్నన్ గరుణాతరంగిత కటాక్షస్ఫార వీక్షాపరం పరల న్నన్నుఁ గృతార్థసార్థవహుఁగా బాటింతువంచున్ భవ చ్ఛరణంబుల్ శరణంబు వేడెదను బో సర్వేశ్వరీ ! యీ చరా చరభూత ప్రకరోపజీవ్యములు.. శశ్వత్సౌఖ్యసంప్రాప్తికిన్.
ఆ వాల్మీకిమహర్షి నీదయిన దివ్యాకార మీక్షించి ఆ యావేశంబున బల్కినట్టి దొక కావ్యంబయ్యె- నీ రమ్యమూ ర్యావిర్భావమునన్ హఠాచ్చకితుడై యా కాళిదాసుండు తా నైవేద్యంబుగ నీకొసంగిన కృతుల్ నానారసాలంకృతుల్.
నామము రూపమంచు నొకనాటక మీయది నీదు వైఖరీ ధామమె - దీనిదాటిచన తారసిలున్ మఱిమూడు- వానికే నామము రూపముం గలవు- నల్గడ గన్పడు నట్టిదెల్ల నీ వామకటాక్ష పాతిత నవామల దీధితిజాలమే సుమీ !
Page 1