#


Index

  జీడిపప్పు లాగా మంచి పద్యాలూ, మాటలూ కూడా మీకు హృద్యంగా సాక్షాత్కరిస్తాయి.

నేను చెప్పటం దేనికి. మీరే చూడండి. చదవండి. మళ్లీ మళ్ళీ చదివి చూడండి. రసజ్ఞులూ తత్త ్వజ్ఞులైతే మీకే తెలుస్తుంది. దీనిలో ఎంత సారస్యముందో. ఆమాటకు వస్తే మరొక మాట కూడా చెప్పవలసి ఉంది మీకు. నాకు దొరికిన నగలూ నట్రా మరొక రెండు కూడా ఉన్నాయి. అద్వైత విజ్ఞానసారమే ఇంకొక రెండు పాత్రలలో నిండుగా పోసి ఉంచాను. అయితే అవి రెండూ తెలుగు పాత్రలు కావు. సంస్కృత పాత్రలు. సంస్కృత భాషలోనే వ్రాశానవి ఎప్పుడో. అవి కూడా ప్రచురించాలని ఉంది త్వరలోనే. నాగర లిపిలోనే వ్రాసి అచ్చువేస్తే రాష్ట్రంలోనే కాక, దేశవిదేశాలలో కూడా తదులందరూ చూస్తారు గదా అని నా ఆశ. చూద్దాం కాలో హ్యయం నిరవధి ర్విపులాచ పృథ్వీ. ఇంకొక్క విషయం. ప్రస్తుత మీ గ్రంధంలో పందొమ్మిదే ఉన్నాయి వ్యాసాలు. మరీ పందొమ్మిదే అయితే బేసి సంఖ్య. బాగుండ దనిపించింది. అంచేత మరొక్క వ్యాసం సంస్కృతంలో వ్రాసి చివరలో ప్రకటిస్తున్నాను. అది తెలుగు లిపిలోనే ఉంది. సంస్కృతాభిజ్ఞు లైనవారు చదువుకొని ఆనందించవచ్చు.

సెలవు,
భవదీయ:
శ్రీనివాస నామధేయః