#


Index

విచిత్ర ద్వారము

  ఇటీవల త్రవ్వకాలలో మళ్ళీ కొన్ని బయట పడ్డాయి. ఇవేమీ శిథిలాలు కావు. భయపడకండి. నన్నడిగితే మణులూ, మాణిక్యాలూ, ఇంతకు ముందిలాంటివే కొన్ని బయటపడితే వాటన్నింటినీ పోగుచేసి చిత్రతరంగిణి అనే పేరుతో మీ కందించాను. అప్పుడివి నా దృష్టిలో పడకుండా ఎలా తప్పి పోయాయో నాకే తెలియదు. నా అదృష్టం కొద్దీ ఇప్పటికైనా దృష్ట మయ్యాయి. అదే నాకు సంతోషం.

ఇక ఆలస్యం దేనికి. వెంటనే మీ వంటి రసజ్ఞుల కంద జేస్తే బాగుంటుందని సంకల్పం కలిగింది. ఇదుగో ఈ మూసలో బోసి మీ చేతి కిస్తున్నాను. స్వీకరించండి. ఆస్వాదించండి. దీని అన్న చిత్ర తరంగిణి అయితే దాని తమ్ముడిది విచిత్ర తరంగిణి. అందులో లేని విశేషాలు కొన్ని ఇందులో పొందుపడి ఉన్నాయని అర్థం.

ఇందులో వేదాంత భాగ మెంత ఉందో వచ్చీ పోయి సాహిత్యభాగం కూడా అంత ఉంది. సాహిత్య సౌరభమనే పేరుతో దాని స్వరూపమూ దాని అందచందాలూ వాటి ప్రయోజనమూ అంతా బయటపెట్టాను. మఱి దానికి తార్కాణంగా అల్లసాని వారి కావ్యనిర్మాణ రహస్యాన్ని కూడా విప్పి చెప్పాను. పోతే ఇక అద్వైత వేదాంత మంటారా, దాని సారమంతా ఆబాలగోపాలమూ అందరికీ పక్షపాతం లేకుండా పంచిపెట్టాను. కాగా ఈ రసాయనంలో అక్కడక్కడా ద్రాక్షా,