#


Index

  ఎలా పోతుందో ఆ ఉపాయాన్ని పట్టుకొని పోతే చివరకు దానికే సమాధానం వస్తుందో అదే దీనికీ సమాధానం. ఇలాంటి ఉపాయానికే ప్రయత్నమని సాధన అని పేరు. సాధన చేస్తేనే ఎప్పటికైనా సిద్ధి. లేకుంటే దానికెప్పటికీ నోచుకోలేము. అంత వరకూ అది కేవలం సిద్ధాంతమే గాని అనుభవం కాదు.

  అయితే అద్వైతంలో సాధన అనేది ఉందా అని ప్రశ్న. అంతకు ముందు లేని పదార్థమైతేనే సాధన వల్ల తయారు చేసుకోవలసి ఉంటుంది. తయారై ఉన్న దాన్ని క్రొత్తగా సాధించట మేమిటి ? అనుభవించట మేమిటి. అత్మ అనేది ఏదో కాదు. మన స్వరూపం. అది ఇంతకుముందే సిద్ధమైన పదార్ధం. తయారు చేయ నక్కరలేదు. చేస్తే అప్పుడది ఆత్మే కాదు. అనాత్మ ప్రపంచంలో ఏదో ఒక పదార్ధమౌతుంది. దానికేమి. పూర్వ సిద్ధమైనా దూరంగా ఉన్న దాన్ని దగ్గరకు తెచ్చుకొనే ప్రయత్న ముంటుంది కదా అనవచ్చు. అది మనకెప్పుడూ దూరం కాదు. మన స్వరూపమేనని పేర్కొన్నాము. పైగా లోపలా వెలపలా అనే తేడా లేకుండా సర్వత్రా వ్యాపించి ఉంది. అలాంటప్పుడిక సాధన ఏమిటి.

  కావచ్చు. మన స్వరూపమైనా మరచి పోయి ఉండవచ్చు గదా మరిస్తే అది మనదే అయినా మరుగుపడి ఉండవచ్చు గదా అన్నావో, భేష్, అలాంటప్పుడు క్రియా రూపమైన సాధన కాదది. కేవలం గుర్తు చేసుకుంటే సరిపోతుంది. సాధన గాని సాధన ఇది. ఇలాంటి సాధన అయితే మేము కాదన మంటారు అద్వైతులు. దీనికే ప్రత్యభిజ్ఞ అని పేరు పెట్టారు. మరచిపోయిన సత్యాన్ని గుర్తు చేసుకోటమే ప్రత్యభిజ్ఞ. జీవ జగదీశ్వరులనే మూడింటికీ స్వరూపం నేనే నా చైతన్యమేననే విషయం మరచి పోయాము మన మందరమూ. అంటే అధిష్ఠాన జ్ఞానం లేదని అర్ధం.

Page 139