పరమ పురుషార్ధము - మోక్షము
ఆ ముష్మికంలో ధర్మ పురుషార్ధాన్ని ఇంతవరకూ విచారించాము. పోతే ఇక మిగిలింది నాలుగవది ఐన మోక్ష పురుషార్ధం. ఇది అన్నిటి కన్నా చివరది. కనుక చరమమని ఉత్తమమైనది గనుక పరమమని పేరు వచ్చింది. ధర్మం జనన మరణాలనే రెండింటిని అలాగే ఉంచి జన్మాంతరాలు, అందులో మరల సుఖ దుఃఖానుభవాలు - వీటిని గురించే ఏకరువు పెడుతుంది. అంచేత సమస్య పూర్తిగా పరిష్కారం కావాలంటే మోక్ష పురుషార్ధమే చివరకు శరణ్యం. మోక్షమంటేనే పరిష్కారం. అది ఈ జీవభావం పోనంతవరకు లభించేది కాదు. తన స్వరూపాన్ని ఉన్నదున్నట్టు గ్రహిస్తే కాని జీవభావం పోదు. తన స్వరూపాన్ని గుర్తించ గలిగినప్పుడే భగవత్తత్త్వం గూడ గుర్తించగలడు. బ్రహ్మ జ్ఞానానికి ఆత్మ జ్ఞానమనేది కుంచికలాగా పని చేస్తుందని పెద్దలమాట.
అస నీ కన్నా సన్నిహితమైన పదార్థం ఈ సృష్టిలో వేరొకటి లేదు. అలాంటి నిన్నే నీవు తెలుసుకోకపోతే మరి ఏది తెలుసుకోగలవు. నన్ను తెలుసుకొనే ఉన్నాను గదా అని నీవనవచ్చు. నీవు తెలుసు కుంటున్నానని చెబుతూ ఉన్నది ఈ తలా మొలా చేతులూ కాళ్ళూ మాంసమూ చర్మమూ - ఇంతకన్నా మరేది కాదు. పోతే నీ లోపల నీవు గుర్తిస్తూ ఉన్నది ఎంత వరకంటే ఆకలి వేస్తే అన్నం తినటం కోపం వస్తే విరుచుకు పడటం కామం చెలరేగితే పెండ్లి పేరంటాలు చేసుకోవటం ఇలాంటి వ్యవహారమే.
Page 115