అని బోధించటం కన్న శాస్త్రానికి వేరే ప్రమేయమే ముంది. కేవల ధర్మాన్ని చెప్పినా లాభం లేదు. కేవల మధర్మాన్ని చెప్పినా సుఖం లేదు. రెంటినీ కలిపి చెప్పినప్పుడే ఆ ప్రమేయం సిద్ధించేది. ఇందులో అధర్మ జ్ఞానం అనర్ధాన్ని పరిహరించటానికి దారి చేస్తే ధర్మ జ్ఞానం అర్థప్రాప్తికి తోడుపడుతుంది. అనర్ధ రహితమైన అర్ధమే కదా అసలైన పురుషార్ధం. కనుక వివేక శాలి అయిన పురుషుడు శాస్త్ర ప్రమాణాన్ని బట్టి అధర్మాన్ని వర్ణిస్తూ ధర్మాన్ని మాత్రమే పాటిస్తూ పోవాలి. ధర్మం వలన కలిగే ఫలం చివరకు జీవితాభ్యుదయం. జీవితమంటే ఐహికమేకాదు. ఆముష్మికం కూడా. దానికే అభ్యుదయమని పేరు. అది లోకాంతర జన్మాంతరాల్లో అనుభవానికి వస్తుందని శాస్త్రం చెబుతున్నది మనకు. ఇప్పుడే అది దృష్టం కాదు కనుక అదృష్టమని అపూర్వమని నామకరణం చేశారు.
Page 114