#


Index

  “విదజ్ఞానే” వేదమంటే జ్ఞానమనే అర్ధం ఇంతకూ ఒకప్పుడు పెద్దలు దర్శించిన సత్యమే ఇప్పుడు మనకు శబ్దంగా వినిపిస్తున్నది. వారి దర్శనం నిగమమై నిగమ మాగమమై ఆగమం శబ్దమై - శబ్దం శ్రుతియై, శ్రుతి వేదమై, ఆవేద మిప్పుడు మనకు ప్రమాణ భూతమైప శాస్త్రమై నిలిచింది. ఇప్పుడది అక్షర రూపంగా కనిపిస్తున్నా అక్షరాలలో బంధించబడిన అనుభవ జ్ఞానమే అది అని మనం గ్రహిస్తే చాలు. దాని ప్రామాణ్యానికి తిరుగులేదు ఇలాంటి శాస్త్ర ప్రమాణం బహికం కాదు. ఆముష్మికం. ఆముష్మికమైన ధర్మాన్ని మనకది చాటి చెపుతున్నది.

  ధర్మ మనే మాటకు కర్మ అని అర్థం. కర్మ అంటే పని. ప్రతి పనీ మనసుతోనో వాక్కుతోనో శరీరంతోనో మూడింటిలో ఏదో ఒక దానితో జరుగుతూ ఉంటుంది. పశు పక్ష్యాదులకు మనో వాక్కులంత బలంగా లేవు. పోతే వాటికున్న దొక్క శరీరమే. దానితో అవి పనులు చేస్తూనే ఉంటాయి. ఐతే ఆ చేసే పనులు బుద్ది పూర్వం కాదు కాబట్టి వాటిని కర్మలని గాక చేష్టలని చెపుతారు పెద్దలు. పోతే బుద్ధి పూర్వకంగా చేసే వాడొక మానవుడే. కాబట్టి వాడి పనులన్నిటికి కర్మలని పేరు పెట్టారు. ఈ కర్మలలో మరలా కర్తవ్యమని ఆ కర్తవ్యమని రెండు జాతులున్నాయి. ఏది తనకూ లోకానికీ హితమో అది కర్తవ్యం. ఏది కాదో అది అ కర్తవ్యం. అందులో కర్తవ్యమైన కర్మకే ధర్మమని పేరు. దానికి భిన్నంగా అ కర్తవ్యమైన దాని కధర్మమని పేరు. యుక్తాయుక్త వివేచనా శీలుడైన మానవు డధర్మాన్ని పరిహరించి ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తూపోవాలి.

Page 112