ఆయా వ్యాపారములు చేయటం తన్మూలంగా అభిమతార్థాల నన్నిటిని పోగు చేయటం అలా ఒనగూడిన వాటి నన్నిటిని తనవి దీర అనుభవించటమూ అలాంటి సుఖానుభూతిని శాశ్వతం చేసుకోవటం ఇంత కన్న జీవితమూ జీవిత ధ్యేయమూ మరేమున్నది. కర్మాచరణతో ప్రారంభమై నిత్య సుఖప్రాప్తితో సమాప్త మవుతున్నది. మొదటిది సుఖం కోసం చేసే ప్రయత్నమైతే రెండవది దానికి ఫలభూతమైన సుఖానుభవం. సుఖాను భవమే గదా సమస్త పురుషార్ధ సారం.
★★★
Page 106