#


Index

  మూడవది పశుపక్షి సరీసృపాదులు. మొత్తం మీద అన్నీ కలిసి మానవుణ్ణి తమలో అధికుడిగా భావించి అతనికే ఈ సృష్టి సామ్రాజ్యాన్ని కట్టబెట్టాయా అనిపిస్తుంది. చేతనా చేతనాలన్నిటి మీద చాలా వరకు మానవుడు తన అధికారం చెలాయించటంలోనే ఈ అంశం మనకు దాఖలా అవుతుంది. అంతేకాదు. ఒక సార్వభౌముడికి సామంత రాజులందరూ కప్పాలు చెల్లించినట్లు చరాచర సృష్టి అంతా మానవుడికే తన సర్వస్వాన్ని ధారపోస్తునట్టు కూడా కనిపిస్తుంది.

  చూడండి! నిర్జీవమైన భూమి అమూల్యమైన తన ఖనిజ సంపదనంతా బయటపెడుతూ ఉందంటే తన కోసమా? కాదు మానవుడి కోసమే. అట్లాగే చెట్లు కాయలు కాస్తున్నాయి పండ్లు పండుతున్నాయి అంటే అదంతా మానవుడి భుక్తి కోసమే. ఇక జంతు జాలము మాట చెప్పనే అక్కర లేదు. పాడి ఆవు మొదలు పట్టపేనుగు వరకు ఏదో విధంగా మానవుడి కుపయోగపడని జంతు వంటూ లేదు. ఇలా ప్రతి ఒక్కటి సృష్టిలో ఈ మానవుడికి దాసోహ మంటున్నదంటే అతడిలో ఏదో ఒక విశిష్టత ఉండితీరాలి. ఏమిటా విశిష్టత. మిగతా గుణాలన్నీ పశుపక్ష్యాదులకు అతనికి సాధారణమే. పోతే వాటికంటే అధికంగా కనిపించే జ్ఞానమనే దొక్కటే అతనికుండే విశిష్టత. ఈ జ్ఞానం కూడా వాసనా రూపమైతే మరలా ప్రయోజనం లేదు. అది జంతువులకూ ఉంది. వివేచనాత్మకమైన జ్ఞానం కావాలి. వాసనా జ్ఞానమని వివేచనా జ్ఞానమని అప్పటికి జ్ఞానం రెండు విధాలు. కేవలమూ ఆకలి దప్పులు రాగద్వేషాల దాకా పరిమితమైన జ్ఞానమే అయితే అది వాసనా జ్ఞానం. అంతకు మించి పూర్వా పరాలను కలియబోసి కొని ఇది కర్తవ్యం,

Page 102