#


Index

మానవ జన్మ - దాని విశిష్టత

  మనం పుట్టినప్పటి నుంచి చూస్తున్నా మీ ప్రపంచాన్ని. ఇది ఎంత విచిత్రమైనదో అంత విశాలమైనది. అచేతనాలని పరిగణించ బడే రాళ్ళు రప్పలు మొదలు కొని చేతనాలన్నింటిలో గొప్పవాడని పట్టం కట్టుకున్న మానవుడి దాకా అంతా ప్రపంచమే. రాళ్ళు, రప్పలు మొదలైన అచేతన పదార్ధాలకు అసలు ప్రాణమే లేదు. చెట్లకు, చేమలకు ప్రాణ ముంది కాని జ్ఞానం లేదు. పశు పక్ష్యాదులైన తిర్యక్కులకు ప్రాణము జ్ఞానము రెండూ ఉన్నాయి. కాని ఆ జ్ఞానం వాసనా జ్ఞానమే. వివేక జ్ఞానం కాదు. వివేక జ్ఞానమున్నది మానవుడొక్కడికే. ఇంతే కాదు. కాష్ఠ లోష్టాదుల మాదిరి మానవుడికి జడమైన శరీరమూ ఉంది. ఓషధి వనస్పతుల మాదిరి ప్రాణమూ ఉంది. పశు పక్ష్యాదుల మాదిరి వాసనా జ్ఞానమూ ఉంది. అన్నింటికన్నా అదనంగా వివేక జ్ఞానమూ ఉంది.

  ఈ విధంగా అన్ని లక్షణాలూ ఒక్క మానవుడిలో ఒనగూడి ఉండటం మూలాన్నే 'తడికి పురుషుడనే పేరు సార్ధకమైంది. పురుషుడంటే పూర్ణుడని అర్ధం. పూర్ణత్వం మానవు డొక్కడిలోనే ఉంది. మిగతా సృష్టిలో ఎందు లోనూ లేదు. ఎందు చేతనంటే మిగతా సృష్టిలో ఒక్కొక్క దానిలో ఒకటి రెండు మూడు లక్షణాలు మాత్రమే అయితే మానవ సృష్టిలో ఉండవలసిన అన్ని లక్షణాలూ మనకు ప్రత్యక్ష మౌతున్నాయి. ఇదే పూర్ణత్వమనే మాట కర్ధం.

  పూర్ణత్వాని కపూర్ణత్వ మెప్పుడూ తక్కువే. అపూర్ణములైన వస్తువులన్నీ పూర్ణత్వాన్ని అందుకొనే మార్గంలో ఏర్పడ్డ అనేకములైన మజిలీలు. అందులో మొదటి మజిలీ మృత్తి కా పాషాణాదులు. రెండవ మజిలీ వృక్షల తా గుల్మాదులు.

Page 101