#


Index

  ఒకవేళ భిన్నమని చూచినా వాటికి ప్రత్యేకమైన ఉనికి లేదుగదా భయమేమి. మనస్వప్నమే మనకిక్కడ మంచి నిదర్శనం. స్వప్నంలో చిత్రవిచిత్రమైన ప్రపంచం కనిపిస్తుంది మనకు. ఎక్కడ ఉందది. ఏమిటది. ఎక్కడా లేదు. ఏమీ గాదు. అంతా మన స్వరూపమే. స్వరూపమే తెలియక చూస్తే జ్ఞానమే జ్ఞేయమై కనిపిస్తుంది. భిన్నంగా భాసిస్తుంది. సుఖదుఃఖాలను ఆపాదిస్తుంది. అదే తెలిసి చూస్తే జేయమంతా జ్ఞానంగా మారి అఖండమైన ఆత్మానుభవాన్ని ప్రసాదిస్తుంది. ప్రస్తుత మీ జనన మరణాది భావాలన్నీ జ్ఞాన దృష్టికి ఒక స్వప్నంలాగా ఆ భాస. స్వతంత్రమైన ఉనికి లేదు దానికి. మన ఉనికే దాని ఉనికి. పోతే అజ్ఞాని దృష్టికి జననమూ ఉంది మరణమూ ఉంది. అంతా ఉంది. శాస్త్రంకూడా ఈ అజ్ఞాని దృష్టిని అనుసరించే ధర్మాధర్మాలు లోకాంతరాలు జన్మంతరాలు సుఖదుఃఖాది అనుభవాలు అన్నీ వర్ణించింది. అదే జ్ఞాని దృష్టి ననుసరించి ఏది లేదని మరలా త్రోసి పుచ్చింది. దృష్టిలో కాని భేదం సృష్టిలో లేదు. ఇది చక్కగా గ్రహించి సాధకుడైన వాడు శాస్త్రాచార్య సహాయంతో శ్రవణ మననాదులు చేసి సర్వమూ ఆత్మా కారంగా దర్శించి జనన మరణాల కతీతుడైతే అనాసక్తుడు- ముక్తుడు-ధన్యుడు- త్రిలోక మాన్యుడు కాగలడు.

Page 100