#


Index

సగుణ భక్తులు - కుంతీ ప్రభృతులు

పాంచాలీ కబరీ వికర్షణ మహా పాప క్షతాయుష్కులం జంచద్గర్వుల దార్త రాష్ట్రుల ననిం జంపించి గోవిందు డి ప్పించెన్ రాజ్యము పాండవేయులకు గల్పించెన్ మహాఖ్యాతిఁజే యించెన్ మూడు తురంగమేధములు దేవేంద్ర ప్రభా వోన్నతిన్

  ద్రౌపదీ వస్త్రాపహరణ మనేది ఎంతటి అవమానకరమైన సన్నివేశం. అలాటి ఎన్నో క్లేశాలనుంచి తప్పించిన వాడా పరమాత్మే. చివరకు ప్రాజ్యమైన సామ్రాజ్యాన్ని ధర్మజుని చేతికందించిన వాడూ ఆయనే. మూడు అశ్వమేధ యాగాలు చేయించి దేవేంద్రునికంటే గొప్ప కీర్తి ప్రతిష్ఠలా పాండవుల కార్జించి పెట్టినవాడూ ఆ భగవానుడే. అయితే చిత్రమేమంటే ఇంత మహోపకారాలు గావిస్తున్నా లోకోత్తరమైన చర్యలప్పుడప్పుడు ప్రదర్శిస్తున్నా విశ్వరూపాదులే చూపి తన భగవత్తత్త్వాన్ని బాహాటంగా చాటుతున్నా తెలుసుకోవలసినంత గాఢంగా తెలుసుకోలేకపోయారు పాండవులు. ఏమి కారణం. నల్లనివాడు పద్మనయనంబుల వాడని సగుణంగానే భావిస్తున్నా రాయనను వారు. ప్రేమతోనే తప్ప జ్ఞానంతో దర్శించటం లేదా తత్త్వాన్ని. కడకు ఆ మహాత్ముడి ముఖతః భగవద్గీత లాంటి మహోపదేశాన్నే విన్న అర్జునుడు కూడా నోచుకోలేదా జ్ఞానానికి. అయితే తన తల్లి కుంతిలాగానే అతడూ ఎంతగానో గ్రహించినట్టు చేసినట్టూ అభినయిస్తాడు. “నష్టో మోహః స్మృతి ర్లబ్బా” నాకు అజ్ఞాన తమస్సంతా విరిసిపోయింది. జ్ఞానజ్యోతి దేదీప్యమానంగా వెలిగిపోతుందని ప్రజ్ఞలు చెప్పుకొన్నాడు. ఇంత భీకరాలు పలికినవాడు యుద్ధానంతరం కృష్ణుడు తమరి నందరినీ వీడ్కొని పోయేటప్పుడు అన్న మాటలేమిటో చూడండి.

యద్యద్భగవతా ప్రోక్తమ్ - పురాకేశవ సౌహృదాత్ తత్సర్వమ్ పురుష వ్యాఘ్ర - నష్టమ్ మేభ్రష్ట చేతసః మమ కౌతూహలం త్వస్తి - తేష్వర్థేషు పునః పునః

  బావా నీవింతకు ముందేదో ఒక గొప్ప విషయం చెప్పావు నాకు. అది ఇప్పుడు నా మనసులో లేదు. నేను చాలా దురదృష్టవంతుణ్ణి. అది మరలా ఒకసారి వినాలని నాకు కుతూహలంగా ఉంది. చెబుతావా అని అడుగుతాడు. చూడండి. అంతకు ముందు నా అజ్ఞానమంతా తొలగిపోయిందన్న పెద్దమనిషి ఇప్పుడా విషయమే

Page 259

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు