#


Index

ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము

  ఈ భావన అంటే ఏమిటని ప్రశ్న. ఆయుర్వేదంలో ప్రసిద్ధమైనదీ మాట. లేహ్య చూర్ణాదులైన ఔషధాలను తయారు చేయటంలో ప్రయోగిస్తారీ శబ్దం. ఒక వస్తువు గుణం మరొక, వస్తువుకు సంక్రమించటమే భావన. వాసన అని కూడా దీనినే వ్యవహరిస్తారు. ఈశావాస్యం అనే మాటలో ఏమని చెప్పామర్థం. ఈశ్వర భావనతో ప్రపంచాన్ని చూడమని కదా. అంటే ప్రపంచానికి ఈశ్వర తత్త్వాన్ని పట్టించి చూడటమని తాత్పర్యం.

  అదే భావ మిక్కడకూడా చెప్పుకోవలసి ఉంది. సచ్చిల్లక్షణాలను నామ రూపాలకు పట్టించి ఈ ప్రపంచాన్ని ఆ ' భావనతో చూడాలి మనం. నిరంతరమూ ఇలాంటి భావన చేస్తూ పోతే క్రమంగా నామరూపాలు నిమజ్జనమై సచ్చిద్రూపమే ఉన్మజ్జనం చెందుతుంది. వాటి స్థానంలో దేవీ రూపమే మనకు సర్వదా ప్రత్యక్ష మౌతుందని భావం. అంతే కాక అది ప్రత్యక్షమైనా మరలా మెరుపు తీగ లాగా అంతర్ధానమైనా కావచ్చు. కాబట్టి అది ఎప్పటికీ ' మరుగుపడకుండా స్థిరంగా నిలచి ఉండటానికి ధ్యానం కూడా అభ్యసించాలి సాధకుడు. ధ్యానం చేత కూడా గమ్యమైనదా దేవతా స్వరూపం. ధ్యానమంటే ఒకే భావం అవిచ్ఛిన్నంగా సాగుతూ. పోవటం, అలా తైల ధారలాగా సాగుతూ పోతే తత్త్వమనేది అవిచ లంగా మనసులో నిలిచిపోగలదు. మనసుతో ఆలోచించే ది – వాక్కుతో ఉచ్ఛరించే ది – శరీరంతో నిర్వర్తించేది – సర్వం చిద్రూపంగా ఏకమై సాక్షాత్కరిస్తుంది. సాక్షాత్కరించి అన్ని దశలలోనూ అలాగే నిలిచి ఉంటుంది.

Page 99

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు