#


Index

ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము

ఉపాధి ద్వయం కూడా వస్తుతః చైతన్యానికి అన్యంకాదు గనుక అనన్యంగా భావించినప్పుడది కూడా అందులోనే కరిగి పోతుంది. ఇలా తత్త్వం పదార్థాలను శోధన చేస్తే- ఆ పదార్థ జ్ఞానం వెంటనే వాక్యార్థ జ్ఞానానికి దారి తీసి- అది సాధకుడికి అప్రయత్నంగా అనుభవానికి రాగలదు. ఈ ఐక్య జ్ఞానమే మహా విద్యా స్వరూపిణి అయిన ఆ దేవి స్వరూపం. తత్త్వమసి మహా వాక్యమే గురువు శిష్యుడికి ఆ విద్య నుపదేశించే విధానం.

22. విమర్శ రూపిణీ

  ఇలాంటి బ్రహ్మ విద్యను సాధకుడు నిత్యమూ విమర్శిస్తూ పోవాలి. విశేషేణ మర్శ: విమర్శః. ఒక విషయాన్ని బాగా లోతుకు దిగి పరిశీలించట మని అర్థం. పునః పున రను సంధానమని కూడా దీనినే పేర్కొటారు. ఇలాంటి విమర్శ రూపిణే ఆ పర దేవత. బ్రహ్మానుభవానికి విద్య ఒక్కటే తప్పవిడిచి మరి ఏ అనుష్ఠానమూ అక్కర లేదు గదా. అలాంటప్పుడీ విమర్శ వల్ల ప్రయోజన మేమిటని ఆశంక కలగవచ్చు.

  విద్యే చాలు వాస్తవానికి. అదే అనుభవం. సందేహం లేదు. కాని అలాటి విద్య కలగాలంటే హఠాత్తుగా కలిగే వ్యవహారం కాదు. దానికి ప్రయత్నం ఆవశ్యకం. అలాంటి ప్రయత్నమే విమర్శ. నిరంతర ఆలోచనాత్మక మిది. తత్త్వమసి వాక్యం మీద విచారణకే విమర్శ అని పేరు. తత్త్వం అనే రెండు పదార్థాలూ శ్రవణం చేసి నంత మాత్రాన సరి పోదు. ఎన్నో సందేహాలుండి పోతాయి. వాటిని మనం మననం ద్వారా పోగొట్టుకోవాలి. మననమే విచారణ.

Page 94

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు