ముఖావలోకనము
అవుతుంది. దీనిని బట్టి జపమనేది కేవలం జపం కోసమే కాదు. దానికి లక్ష్యభూతమైన ఏ శివతత్త్వమున్నదో దాన్ని చేరటమే జపానికి తాత్పర్యమని మనకీనామం వల్ల ధ్వనిస్తున్నది.
మరి ఆ లక్ష్యాన్ని చేరటం ఎలాగ అని అడిగితే ఆ మార్గాన్ని మనకు ధ్వనింపజేస్తూన్నది రహోయాగక్రమారాధ్యా అనే రెండవ నామం. రహోయాగమంటే రహస్యయాగం. అది జ్యోతిష్టోమాదుల మాదిరి బాహ్యంగా అనుష్టించే యజ్ఞం కాదు. ఆభ్యంతరంగా జరగ వలసిన జ్ఞాన యజ్ఞం. దానికి ఏ మార్గం అనుకూలమో ఆ మార్గంలోనే దేవినారాధించాలని భావం. అంటే అర్థం. శివశక్తి సామరస్య రూపమైన దేవీ తత్త్వజ్ఞానం ఏ క్రమంలో మనకు లభిస్తుందో ఆ క్రమాన్నే మనమీనామసహస్రంలో అన్వేషించవలసి ఉంది. అంతే గాక ఆ సాధన క్రమానికి ఉపకరించే నామాలేవున్నవో వాటినే తీసుకోవలసి ఉంది.
అసలు సహస్రనామాలని పేరేగాని అన్ని నామాలూ దేనిపాటికది విలక్షణంగా కనపడవు మనకు. వందల కొద్ది పునరుక్తులు కనిపిస్తాయి. శబ్దంలో కాకపోయినా అర్థంలో కుప్పతెప్పలు. ఒకే అర్థమిచ్ఛే నామాలు ఎన్నో దొర్లుతుంటాయి. ఈ విధమైన పునరుక్తులే గాక భావప్రతిపాదనలో కూడా ఒక హేతుబద్ధమైన క్రమమున్నట్టు కనిపించదు. నామావళిని నిశితంగా పరిశీలించే భావుకులకు ఇది నేను నిరూపించనక్కర లేదు. కాబట్టి అన్ని నామాలనూ ఆ క్రమంలోనే తీసుకోవాలని గాని వ్యాఖ్యానించాలని గాని నేను నిర్బంధం పెట్టుకోలేదు. అలా పెట్టుకొన్నా అది కేవలం సంప్రదాయాన్ని అనుసరించి పోయామనే
Page 9