ముఖావలోకనము
తృప్తే తప్ప సమ్య గ జ్ఞానానికి పూర్తిగా ఉపయోగపడుతుందనే తృప్తి కలగదు మనకు.
అంచేత లోకంలో మోక్షపురుషార్థాన్ని మనసారా అపేక్షించే సాధకులందరికీ శివాత్మ జ్ఞానమనేది ఎలా ఏర్పడాలో- ఎన్ని నామాలను ఏ క్రమంలో భావిస్తే అది ఏర్పడుతుందో అన్ని నామాలనే గ్రహించి వాటిని రహోయాగక్రమానికనుకూలంగా మలచుకొంటూ వచ్చాను. యాదృచ్ఛికంగా అవి అష్టోత్తర శతమే కావటమొక విశేషం. అష్టోత్తరమైనా ఇది నా స్వకపోల కల్పితం కాదు. సహస్ర నామాలలోనివే కాబట్టి వాటిలాగ ఇవి మనకు ప్రామాణికమే. నేనీ నామావళి పరమార్ధాన్ని మొదట సంస్కృత భాషలోనే వ్రాసి ప్రకటించాలని సంకల్పించాను. అందులోనే గ్రంథాన్ని వ్రాసి పూర్తి చేశాను కూడా. కాని అలాగే దాన్ని ప్రకటిస్తే చాలా మంది తెలుగువారికది అర్థం కాదేమో నని దానినే మరలా తెలుగులోకి అనువదించి ప్రస్తుతం మీకు వివరించి చెబుతున్నాను. ఇది మీకు చేస్తున్న వివరణమని నేను భావించటం లేదు. ఈ నెపంతో బహుకాలం నుంచి నా హృదయంలో దాగి మరుగు పడిన శివశక్తి సామరస్య జ్ఞానాన్ని నాకు నేనే వివరించుకొంటున్నానని తమ కందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను.
ఇతి
శివశక్త్యుత్సంగ లాలితః
శ్రీనివాస మహా గణేశః.
Page 10