#


Index

ముఖావలోకనము

మరలా ఆ తత్త్వాన్ని విద్యా బలంతో గుర్తించిన వాడికి అదే శివాత్మకమై భాసించటం వేరొక రహస్యం. ఈ రహస్య ద్వయం సాధకులందరి మనసులకు స్పష్టంగా బోధపడాలనే దృష్టితో దేవీ నామావళిని వ్యాఖ్యానం చేయాలని ఈనా ప్రయత్నం. వెయ్యి నామాలనూ నేను వ్యాఖ్యానించటం లేదు. ఆ క్రమంలో కూడా వ్యాఖ్యానించటం లేదు. వాటిలో నాకుకావలసిన కొన్ని నామాలను మాత్రమే తీసుకొని ఒక విలక్షణమైన క్రమంలో వాటిని వివరిస్తూ వచ్చాను.

  ఇది ప్రసిద్ధమైన సంప్రదాయాన్ని ఉల్లంఘించటం గదా అని కొందరికి తోచవచ్చు. అలాంటి అపోహ ఏదీ పెట్టుకో నక్కర లేదు. సాధనమార్గంలో ప్రయాణం చేసే జిజ్ఞాసువులను ఉద్ధరించటానికి పనికి వచ్చే మార్గమిది. ఎలాగంటే నామసహస్రంలో రెండు నామాలు చాలా అద్భుతమైనవి కనిపిస్తాయి మనకు. ఒకటి నామ పారాయణ ప్రీతా. మరొకటి రహోయాగక్రమారాధ్యా. ఈ _ రెండింటి అర్థాన్నీ కొంచెం లోతుకు దిగి విమర్శిస్తే చాలు. ప్రస్తుతం నేనవలంబించిన ఈ మార్గం ఎంత సమంజసమైనదో మీకే తెలిసిపోతుంది. నామ పారాయణ ప్రీతా అంటే నామపారాయణంచేత సంతోషిస్తుందట ఆదేవి. కనుకనే నామాపారాయణప్రీతా అని కీర్తించబడుతుంది. పారాయణమంటే ఎడతెగకుండా నామాలను ఉచ్చరించటమని గాదు. నామాలకు ఏ పారం ఉన్నదో ఆ పారాన్ని అయనం అనగా చేరటమని అర్థం. నామాలన్నింటికి ఒకానొక గమ్యం ఉన్నది. అదే నామ పారం. ఆ గమ్యాన్ని ఈ నామ జపం చేత అందుకోవాలి సాధకుడు. అప్పుడే అది నామపారాయణ మవుతుంది. ఆ దేవి కూడా అప్పుడే ప్రసన్న

Page 8

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు