#


Index

ముఖావలోకనము

వస్తువు గోచరించినట్టు జ్ఞానం వల్ల అజ్ఞానం తొలగితే ఈ సృష్టి అంతా శివాత్మకం గానే దర్శనమిస్తుంది.

  కాబట్టి ఎక్కువగా ఈ విషయంలో శంకించనక్కర లేదు. చైతన్యశక్తే ఈ సమస్త సృష్టి. శక్తే భూతభౌతికాది వ్యక్తి రూపంగా భాసిస్తున్నది. కారణ చైతన్యానికి స్వరూపం శక్తి అయితే శక్తి స్వరూపమే జగత్తు. జగత్తని చూస్తూన్నది కూడా మనం ఆ శక్తినే. మరి దేనినీ గాదు. అమూర్తమైన శక్తే మూర్తమై కనిపిస్తున్నదని భావించాలి మనం . మాటిమాటికీ అలా భావిస్తూ పోతే ఈ శక్తి మరలా మనలనా మూలభూతమైన శివతత్త్వానికి తీసుకెళ్లగలదు. అంతవరకూ తిరోధాయిని అయిన ఆ శక్తే అప్పుడు మరలా అనుగ్రాహిణిగా మారుతుంది సాధకులకు. కనుకనే విద్యా విద్యా స్వరూపిణి అని ఆ దేవి కీర్తించబడుతూ ఉంది. అవిద్య మూలంగా శివాత్మకమైన మనరూపాన్ని కప్పి పుచ్చి అశివమైన సంసారంలో పడదోసింది మనలను. విద్య మూలంగా మరలా శివసాయుజ్యాన్ని అనుగ్రహించి అశివమైన సంసారాన్ని త్రోసిపుచ్చుతుంది. ఈ అవరోహణ ఆరోహణలనే రెండు భూమికలలోనే దేవీ తత్త్వమంతా పరిసమాప్త మవుతున్నది.

  ఈ ప్రక్రియనే లలితా సహస్రనామమనే స్తోత్రం ద్వారా హయగ్రీవాదులైన ఆచార్యపురుషులు లోకానికి చాటి చెప్పారు. కేవల భావన వల్లనే దానిని గ్రహించాలి గనుక రహస్య నామ సాహస్రమని కూడా ఆ స్తోత్రానికి ప్రసిద్ధి వచ్చింది. ఇందులో రహస్యమేముందని అడగవచ్చు. వస్తుతః శివాత్మిక అయి కూడా శక్తి అశివాత్మకమైన సంసార రూపంగా భాసించటం ఒక రహస్యమైతే

Page 7

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు